టాలీవుడ్ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కాలిక్యులేటడ్  దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కింది పుష్ప సినిమా. ఇక ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా విడుదల కోసం ప్రేక్షకులందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు అల్లు అర్జున్ ని లవర్ బాయ్ పాత్రలో మాత్రమే చూసారు ప్రేక్షకులు. కానీ ఏకంగా లవర్ బాయ్ అల్లు అర్జున్ ఒక లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తే  అది కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది అన్న విషయాన్ని సుకుమార్ తనదైన శైలిలో ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడు.


 మొన్నటివరకు తెలుగు ప్రేక్షకులకు స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప సినిమాతో ఐకానిక్ స్టార్ గా మారిపోయాడు అని చెప్పాలి. ఇక ఇప్పటికే పుష్ప సినిమాకు సంబంధించి విడుదలైన పాటలు సెన్సేషన్ సృష్టించాయి.. యూట్యూబ్ ను షేక్ చేసాయి అంతేకాదు ఇక ఈ సినిమాల్లోని పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా అందరినీ ఆకట్టుకున్నాయి అని చెప్పాలి. ఇలా ఈ సినిమాకు సంబంధించి విడుదలైన అన్ని అప్డేట్ లు కూడా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాయి. ఇక ఇటీవల విడుదలైన పుష్ప సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా ప్రేక్షకులు అందరినీ ఆశ్చర్యపరిచింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఇక ఊహించిన దానికంటే ఎక్కువగా ఈ ట్రైలర్ జనాలను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఇందులో అల్లు అర్జున్ మాస్ గెటప్   కి ఫ్యాన్స్ అందరూ ఫిదా అయిపోతున్నారు అని చెప్పాలి. ఇక ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఎంతోమంది అభిమానులు సినీ సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు ఉండటం గమనార్హం. ఇక ఈ ట్రైలర్ చూసిన తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత  కామెంట్ చేసింది. పుష్ప రాజు ప్రస్తుతం ఫుల్ ఆన్ ఫైర్ ఎమోజి పెట్టి.. తగ్గేదే లే అంటూ రాసి ఒక ఎమోజీ ని ట్వీట్ చేసింది సమంత. అయితే ఈ సినిమాలో సమంత ఐటమ్ సాంగ్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 17వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: