కథల ఎంపిక విషయంలో జాగ్రత్త పడలేదు. దీంతో వరుసగా ఫ్లాప్ సినిమాలు ఈ అమ్మడి కెరియర్ ను దెబ్బతీసాయ్. అయితే కీర్తి సురేష్ కి ఎన్ని ఫ్లాప్స్ వచ్చినప్పటికీ అదృష్టం మాత్రం బాగా కలిసివస్తుంది. స్టార్ హీరోల సినిమాల్లో వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తమిళ అగ్ర హీరో దళపతి విజయ్ సినిమాలో కీర్తి సురేష్ చాన్స్ కొట్టేసింది అనే టాక్ వినిపించింది. ఇక ఈ వార్తలపై స్పందించిన ఈ ముద్దుగుమ్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
దళపతి విజయ్ 66వ చిత్రంగా తెరకెక్కుతున్న సినిమాలో తాను హీరోయిన్ గా నటించడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది కీర్తి సురేష్. అయితే కీర్తి సురేష్ విజయ్ కాంబినేషన్ లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. భైరవ, సర్కార్ లాంటి సినిమాలు వచ్చి మంచి విజయాన్ని కూడా సాధించాయి. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరి కాంబినేషన్ రిపీట్ అవుతుంది అని ప్రేక్షకులు భావించారు. కానీ తాను దళపతి విజయ్ సినిమాలో నటించడం లేదు అంటూ చెప్పడంతో అభిమానులు కాస్త నిరాశ చెందారు. కాగా ప్రస్తుతం విజయ్ హీరోగా నటిస్తున్న 65వ చిత్రం బీస్ట్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.. ఇక దళపతి 66వ చిత్రం దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కబోతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి