టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంక్రాంతి పండుగ వచ్చిందంటే తెలుగు స్టార్ హీరోలు అంతా తమ సినిమాలను విడుదల చేయాలనే ఆలోచనలో ఉంటారు, అలాగే ఈ సంవత్సరం కూడా సంక్రాంతికి తన సినిమాలను విడుదల చేయబోతున్నట్లు తెలుగు స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ తమ సినిమా విడుదల తేదీ లను ప్రకటించారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమాను జనవరి 12 వ తేదీ న విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు, అలాగే మహేష్ బాబు  నటించిన సర్కారు వారి పాట సినిమా ను జనవరి 13 వ తేదీ న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు, ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాదే శ్యామ్ సినిమాను జనవరి 14 వ తేదీ న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.

ఇలా టాలీవుడ్ టాప్ హీరోలు తమ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిన తర్వాత అనూహ్యంగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాను కూడా సంక్రాంతి కానుకగా జనవరి 7 వ తేదీ న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది, దీనితో బాక్సాఫీస్ వద్ద ఇంత పోటీ తగదు అనుకున్న మహేష్ బాబు  అందరి కంటే ముందు తన సినిమాను సంక్రాంతి బరి నుండి తప్పించి ఏప్రిల్ ఒకటో తేదీన విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత సంక్రాంతి బరి నుండి ఏ మాత్రం వెనక్కి తగ్గేది లేదు అన్న భీమ్లా నాయక్ చిత్ర బృందం కూడా తాజా గా తమ సినిమా ఫిబ్రవరి 25 వ తేదీ కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు, ప్రభాస్ హీరోగా నటించిన రాదే శ్యామ్ సినిమా ను మాత్రం జనవరి 14 వ తేదీ నే విడుదల చేయబోతున్నారు, ఇలా ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ క్రేజ్ ఉన్న ఆర్ఆర్ఆర్ సినిమా ముందు ఏ మాత్రం తగ్గడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: