ప్రస్తుతం విద్యార్థులు పరీక్షలు రాసేందుకు రెడీ అయ్యారు. ఇంతలోనే ఎవరూ ఊహించని రీతిలో ఒక ట్విస్ట్ జరిగింది.ప్రశ్న పత్రంలో ప్రశ్నలు సిలబస్ ఆధారంగానే ఉండాలి.. ఈ విధానాన్ని..LKG నుండి PHD వరకు ఇదే పద్ధతిని పాటిస్తూ ఉంటారు. అయితే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ మాత్రం కాస్త భిన్నంగా ఉంటాయని చెప్పవచ్చు. అయితే తాజాగా మధ్యప్రదేశ్ లో ఎగ్జామ్ బోర్డు కు సంబంధించి ప్రశ్నలలో సెలబ్రిటీస్ లైఫ్ కు సంబంధించి ఒక ప్రశ్నను అడగడం వల్ల అందరూ షాక్ అయ్యారు.వాటి గురించి తెలుసుకుందాం.


ఒక ప్రైవేట్ స్కూలో 6 వ తరగతి చదువుతున్న స్టూడెంట్స్ కు పరీక్షలు జరిగాయి.. ఇక ఇందులో హీరో సైఫ్ అలీ ఖాన్-తన భార్య కరీనాకపూర్.. ల కొడుకు పేరేంటి అని ప్రశ్న అడగడం జరిగింది. కేవలం ఈ ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ సంబంధించిన ప్రశ్న కింద అడగడం జరిగింది. దీంతో ఒక్కసారిగా అక్కడున్న టీచర్లు, విద్యార్థులు కూడా ఒక్కసారిగా షాకయ్యారు. ఇక ఈ విషయంపై ఆ విద్యార్థిని తల్లిదండ్రులు కొంతమంది అధికారులకు ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. ఇక కరెంట్ అఫైర్స్ లో సెలబ్రిటీలకు సంబంధించి ఇలాంటి ప్రశ్నలు అడగడం ఏమిటి అంటూ మరికొంతమంది ఆశ్చర్యపోవడం జరిగిందట. కానీ కొంతమంది అధికారులు మాత్రం ఇలాంటి ప్రశ్నలు చాలా అరుదుగా అడుగుతూ ఉంటారు.. కానీ ఇలాంటి ప్రశ్నలు ఎగ్జామ్స్ లో అడగడానికి ఆస్కారం లేదని తెలియజేశారు.
ఏదైనా పొరపాటు జరగడం వల్ల ఇలా వచ్చి ఉంటుంది అని కొంతమంది అధికారులు చెప్పుకొచ్చారు. అయితే ఈ ప్రశ్న నెట్టింట్లో వైరల్ గా మారడం వల్ల కొంతమంది ఈ ప్రశ్నకు సమాధానం వెతకగా.. వీరిద్దరి కుమారుడి పేరు.."తైమూర్ అలీఖాన్ పటౌడీ"కరీనా కపూర్ ali KHAN' target='_blank' title='సైఫ్ అలీ ఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సైఫ్ అలీ ఖాన్ ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే ఇలాంటి ప్రశ్నలు అడగడం సరి కాదని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: