సూపర్ స్టార్ మహేష్ బాబు  ప్రస్తుతం నటిస్తున్న సినిమా సర్కారు వారి పాట, ఈ సినిమాలో మహేష్ బాబు సరసన మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమాకు గీత గోవిందం ఫెమ్ పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు, ఇప్పటికే చాలా భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను కూడా విడుదల చేసింది, వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగివున్న ఈ సినిమాను కొంతకాలం క్రితం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది, అయితే ఈ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేసిన తర్వాత అనూహ్యంగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాను కూడా సంక్రాంతి కానుకగా జనవరి 7 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.

దీనితో మహేష్ బాబు జనాల్లో మంచి క్రేజ్ ఉన్న ఆర్ఆర్ఆర్ సినిమాతో పోటీ పడడం వల్ల రెండు సినిమాల కలెక్షన్ లపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున సంక్రాంతి బరి నుండి తన సినిమా సర్కారు వారి పాట ను తప్పించి ఏప్రిల్ ఒకటో తేదీన విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు, అయితే తాజాగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఆర్ఆర్ఆర్ సినిమాను జనవరి 7 వ తేదీన విడుదల చేయడం లేదు అంటూ చిత్ర బృందం ప్రకటించింది, ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ కొత్త విడుదల తేదీని చిత్ర బృందం ఇంకా ప్రకటించలేదు,  అయితే తాజాగా సోషల్ మీడియా లో వస్తున్న వార్తల ప్రకారం చూస్తే ఆర్ఆర్ఆర్ సినిమాను ఏప్రిల్ 1వ తేదీన విడుదల చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది, అదే కనుక నిజమైతే మరొక సారి ఆర్ఆర్ఆర్ సినిమా వల్ల మహేష్ బాబు సినిమాకు ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది, కానీ ఇంకా ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల తేదీపై ఎలాంటి అఫీషియల్ ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: