టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోల కి బెస్ట్ ఛాయిస్ గా మారిన ప్రియమణి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకుని అగ్ర హీరోయిన్ల సరసన చేరింది. కేవలం తెలుగులోనే కాదు తమిళంలో కూడా దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించింది ఈ ముద్దుగుమ్మ. తమిళంలో కూడా ఈ అమ్మడికి మంచి మార్కెట్ ఉంది. తన సహజమైన నటనతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తన అందచందాలతో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించిన ప్రియమణి సడన్ గా పెళ్లి చేసుకొని ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చింది.

తన ప్రియుడు ముస్తఫా రాజ్ ను ప్రేమ వివాహం చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ.. ఇప్పుడు సినిమాల పరంగా కూడా ఫుల్ బిజీగా మారింది. అయితే ఇదిలా ఉంటే ఒకప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన తరుణ్ కి ప్రియమణి కి మధ్య ఏదో సంబంధం ఉన్నట్లు అప్పట్లో మీడియా వర్గాల్లో ఓ రేంజ్ లో వార్తలు వైరల్ అయ్యాయి. 'నవ వసంతం' సినిమాలో కలిసి నటించిన తరుణ్, ప్రియమణి మధ్య ప్రేమాయణం నడిచిందని.. ఆ సినిమా షూటింగ్ ఈ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించి చాలా క్లోజ్ అయ్యారని.. ఇలా రకరకాలుగా వార్తలు హల్ చల్ చేశాయి. అంతేకాదు ఆ తరువాత కొన్ని రోజులకు వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ మీడియాలో న్యూస్ పెద్ద హాట్ టాపిక్ అయింది.

అయితే ఈ వార్తలను చూసిన తరుణ్ వాళ్ల అమ్మగారు ఏకంగా ప్రియమణిని డైరెక్ట్ గా ఇలా అడిగిందట.." మీ ఇద్దరూ నిజంగానే ప్రేమించుకుంటున్నారా? అదే నిజమైతే మీ ఇద్దరి పెళ్లి చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఏదైనా ఉంటే భయపడకుండా చెప్పండి" అంటూ ప్రియమణిని తరుణ్ వాళ్ళ అమ్మగారు అడిగారట. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన ప్రియమణి.." అలాంటిదేమీ లేదు ఆంటీ.. అవి ఫేక్ న్యూస్, అలాంటి వారిని మీరు నమ్మకండి" అని చెప్పుకొచ్చిందట. ఇక ఇదే విషయాన్ని ప్రియమణి ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. ఇక ప్రస్తుతం ప్రియమణి తన సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలు చేస్తూ మంచి ఫామ్ ని మెయింటైన్ చేస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: