రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా సినీ పరిశ్రమ బాగా అభివృద్ధి చేయాలని 2018 వ సంవత్సరం లో మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 24 విభాగాలతో ఏర్పాటు చేయడం జరిగిందట. ఇక దానిని 14-2-2018 లో ఆమోదించబడింది.. ఇందులో 400 మంది టెక్నీషియన్లు, నటీనటులు ఉన్నట్లుగా సమాచారం. ఇక్కడ కూడా ప్రతి సారి ఈ ఎలక్షన్లు జరపాలని నిర్వహించినట్లుగా సభ్యులు తెలియజేయడం జరిగింది. కానీ యూనియన్ లో అంతగా పేరుమోసిన సెలబ్రిటీస్ ఎవరూ లేరు అని కూడా చెప్పవచ్చు. ఇక్కడ కూడా ఉపాధ్యక్షులు, అధ్యక్షులు, ట్రెజరర్, సంయుక్త కార్యదర్శి,ప్రధాన కార్యదర్శి, ఈసీ మెంబర్లు ఎన్నికలు జరుగుతాయని ప్రతినిధులు తెలియజేస్తున్నారు. తాజాగా ఇటీవలే నామినేషన్ల స్వీకరణ కూడా మొదలు పెట్టడం జరిగింది. ఎన్నికలు ఈ ఏడాది మార్చి 31న జరగబోతున్నాయి అని దిలీప్ రాజా అధికారికంగా తెలియజేయడం జరిగింది.

తెలంగాణలో పోటీ చేసిన మా ఎన్నికలలో వ్యక్తులకు ఇక్కడ పోటీ గా నిలబడేందుకు వీలులేదని తెలియజేయడం జరిగింది. భారతీయ సినిమాకు చెందిన ఎవరైనా పోటీ చేయవచ్చని తెలియజేశారు..నాయకత్వ లక్షణాలు ఉన్న ఎవరైనా సరే ఈ పోటీలో పాల్గొనవచ్చని తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా మా ఏపీలో సభ్యత్వం కలిగి ఉండాలని దిలీప్ రాజా తెలియజేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి