తెలుగు సినిమా పరిశ్రమలో కొత్తగా ఇండస్ట్రీకి పరిచయమయ్యే హీరోయిన్ లకు మంచి డిమాండ్ ఉందని తెలిసిన విషయమే. అందుకే మన డైరెక్టర్లు సైతం సినిమా సినిమాకు కొత్త వారిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఉంటారు. ఇలా పరిచయం అయిన వారిలో అతి తక్కువ మంది మాత్రమే తమ నటనతో అందరినీ ఆకట్టుకుని ఎక్కువ కాలం హీరోయిన్ గా వెలుగొందుతూ ఉంటారు. మరి కొందరు మాత్రం వచ్చిన ఒకటి రెండు అవకాశాలను కాలదన్నుకుంటూ కెరీర్ ను కష్టాల్లో పడేసుకుంటూ ఉంటారు. అలా తెలుగు తెరకు పరిచయం అయిన హీరోయిన్ ఢిల్లీ భామ పాయల్ రాజ్ పుత్. ఈమెకు కేవలం నటనా అనుభవం అప్పటికి తక్కువే అని చెప్పాలి.

అయినా ఆమెలో ఏమి నచ్చిందో తెలియదు కానీ, డైరెక్టర్ అజయ్ భూపతి తన సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు.  అప్పుడప్పుడే నటుడిగా అడుగులు వేస్తున్న కార్తికేయను హీరోగా అనుకుని తీసిన విషాద ప్రేమగాధ "ఆర్ ఎక్స్ 100". ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని ఒక ప్రభంజనం సృష్టించింది. ఈ విజయంతో ఒక్కసారిగా హీరో కార్తికేయ, హీరోయిన్ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ మరియు డైరెక్టర్ అజయ్ భూపతి ఇండస్ట్రీ దృష్టిలో హైలైట్ అయ్యారు. అయితే పాయల్ కి దక్కిన ఈ విజయంతో తన కెరీర్ ను సరిగా మలుచుకోవడంలో విఫలం అయింది అని చెప్పాలి.

ఈ సినిమాతో వచ్చిన ఫేమ్ తో దక్కిన కొద్ది అవకాశాలను సరైన కథలను ఎంచుకోలేకపోయింది. అందుకే ఆ తర్వాత ఆ రేంజ్ హిట్ ను అందుకోలేదు. ఇప్పుడు అయితే రోజుకో హీరోయిన్ వస్తూ పాయల్ లాంటి ఎందరో హీరోయిన్ లను ప్రేక్షకులు మరిచిపోయేలా చేస్తున్నారు. కానీ పాయల్ మాత్రం ఎలా అయినా తెలుగు అవకాశాలు దక్కించుకోవాలని తన వంతు ప్రయత్నం చేస్తోంది. అందుకే ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా తనదైన హాట్ హాట్ ఫోటో షూట్ లతో ఒక వైపు కుర్రకారుల మతులు పొగుడుతూనే, తెలుగు డైరెక్టర్లకు వాలా విసురుతోంది. మరి ఎవరైనా ఈమెకు కనెక్ట్ అవుతారా? రాబోయే రోజులలో అయినా రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ కు మంచి రోజులొస్తాయా? అన్నది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: