రాజమౌళికి 'మహాభారతం' సినిమా ఎలాగ వుందో పూరి జగన్నాథ్‌కి 'జనగణమణ' సినిమా అలాగా ఉందట.ఆ సినిమా గురించి పూరి ఎంత ఇష్టంతో ఉన్నాడో చెప్పడానికి ఈ ఒక్క వాక్యం చాలు.
ఇప్పుడు కాదు ఎప్పుడో 'జనగణమణ' మాట చెప్పారట పూరి జగన్నాథ్‌. ఎలాగైనా ఈ సినిమా చేయాలని కంకణం కూడా కట్టుకున్నాడాయన. అయితే ఆ సినిమాకు పరిస్థితులు అనుకూలించడం లేదట.ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. గతంలో మూడు సార్లు ఈ సినిమా గురించి అనుకొని కూడా ఆగిపోయారు పూరి.

ఇప్పుడు మరోసారి అదే చర్చ నడుస్తోందట.ఇప్పుడు చర్చ ఎందుకు నడుస్తుందో ముందు మనం చూద్దాం. ఆ తర్వాత పాత సంగతి చూద్దాము.. ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ 'లైగర్‌' పనుల్లో ఎంతో బిజీగా ఉన్నాడు. విజయ్‌ దేవరకొండ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోందట.పూరి కెరీర్‌లో ఎప్పుడూ లేని విధంగా ఈ సినిమా కోసం సంవత్సరాలు తరబడి మరి పని చేస్తున్నారు. దీనికి కరోనాను కారణం చూపించి వారు తప్పించుకోలేరు. ఎందుకోగానీ సినిమా ఆలస్యమవుతోంది. దీని సంగతి పక్కనపెడితే కనుక 

 

ఈ సినిమా తర్వాత పూరి - రౌడీ కాంబోలో మరో సినిమా ఉందబోతున్నది అనేది తాజా పుకారు. అవును 'లైగర్‌' తర్వాత విజయ్‌ కోసం పూరి ఓ కథ కూడా సిద్ధం చేశారని వార్తలొస్తున్నాయి. అయితే ఆ కథేంటి అనేది మాత్రం తెలియదు. కానీ 'జనగణమన' కథనే విజయ్‌ దేవరకొండతో తీద్దామని పూరి అనుకుంటున్నారని సమాచారం.దాని కోసం చర్చలు కూడా చాలా నడిచాయట. 'లైగర్‌' విజయం సాధిస్తే ఆ తర్వాత 'జనగణమన' స్టార్ట్‌ చేద్దామని వారు చూస్తున్నారట. దీంతో 'లైగర్‌' ఫలితం రెండు సినిమాల మీద బాగా ప్రభావం చూపిస్తుంది.

 

ఇక ముందు చెప్పినట్లు గతంలో వచ్చిన చర్చలు చూస్తే.. నితిన్‌ 'హార్ట్‌ ఎటాక్‌' ముందు ఒకసారి 'జనగణమన' పేరు వినిపించిందట.. అయితే అప్పుడు ఆ సినిమా వర్కౌట్‌ అవ్వలేదని అస్సలు మొదలుకాలేదు. ఆ తరువాత మహేష్‌బాబు 'బిజినెస్‌ మ్యాన్‌' సమయంలోనూ సేమ్‌ చర్చ జరిగింది.సేమ్‌ రియాక్షన్‌ అలాగే సినిమా హాల్ట్‌. ఆ తర్వాత కొన్ని రోజులకు బాలకృష్ణతో చేసిన 'పైసా వసూల్‌' కూడా విడుదలైంది. అప్పుడు కూడా 'జనగణమన' పేరు వినిపించింది. కానీ మెటీరియలైజ్‌ మాత్రం కాలేదు. ఈ మూడు సినిమాల ముందు కూడా కొంతమంది హీరోలతో పూరి 'జనగణమన' గురించి చర్చించాడట . కానీ అవేవీ అస్సలు వర్కౌట్‌ కాలేదు. ఇప్పుడు మరి విజయ్‌ దేవరకొండతో అనుకుంటున్నాడట ఏమవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: