అయితే అంతేకాదు ఎక్కడ చూసినా పుష్ప సినిమాకు సంబంధించిన డైలాగులు వీడియోలు చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారూ. ఇక బుల్లితెర కార్యక్రమాల్లో కూడా పుష్ప స్పూఫ్ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులందరికీ సరి కొత్త రకం ఎంటర్టైన్మెంట్ పంచుతున్నారు. ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు లలో పుష్ప సినిమా స్పూఫ్ చేయడం చూశాం. ఇక ఇందులో పుష్పరాజ్ పాత్రలో ఎంతో మంది కమెడియన్స్ అదిరిపోయే పంచులతో నవ్వించారు. కానీ ఈ టీవీలో వచ్చే వారం ప్రసారం కాబోతున్న ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమం లో మాత్రం కాస్త కొత్తగా ట్రై చేసారు.
పుష్ప రాజ్ కాదు ఏకంగా పుష్ప రాణి స్టేజ్ మీదికి వచ్చింది. అచ్చంగా పుష్ప సినిమలో అల్లు అర్జున్ మేనరిజంతో ఇక పుష్ప రాణి అనే ఒక లేడీ కమెడియన్ స్టేజి మీదికి వచ్చి చిత్తూరు యాసలో డైలాగులు చెబుతూ ప్రేక్షకులను అలరించింది. అయితే అందరూ పుష్ప రాజ్ ని ఇమిటేట్ చేస్తూ ఉంటే ఇక సరికొత్తగా పుష్ప రాణి అనే ఐడియా మాత్రం ప్రేక్షకులందరికీ తెగ నచ్చేసింది అని చెప్పాలి. దీంతో సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు ఎంతోమంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో పై లుక్కేయండి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి