అయితే రాజీవ్ కనకాల సుమ ఇద్దరూ కలసి తన కొడుకు రోషన్ కెరియర్ మార్చడానికి చాలా ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. సొంతంగా ఒక సినిమాను కూడా నిర్మిస్తున్నారు. రోషన్ హీరోగా గత సంవత్సరం కొత్త సినిమాకు పూజా కార్యక్రమాలను కూడా మొదలు పెట్టడం జరిగింది. అందుకు సంబంధించిన పూజా కార్యక్రమం కూడా గుడిలో చాలా ఘనంగా నిర్వహించారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ కూడా ఇంతవరకు బయటికి రాలేదు. కానీ రోషన్ ఫోటోలు ఎక్కువగా సోషల్ మీడియాలో అంతగా కనిపించవు.. రోషన్ కూడా ఎప్పుడూ సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా కనిపించరు.అయితే ఈ రోజు రోషన్ బర్త్ డే సందర్భంగా యాంకర్ సుమ తన కొడుకు ఫోటోలను కొన్నిటిని షేర్ చేసినది.. తన కొడుక్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ ఫోటోలు షేర్ చేయడంతో వాటిని నెటిజన్స్ చూసి ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. రోషన్ ఏంటి ఇలా మారిపోయాడు .. ఎంత హైట్ ఉన్నాడు ఏంటి అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది రోషన్ ను గుర్తుపట్టలేక పోతున్నాను అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి తన కొడుకు పుట్టినరోజు సందర్భంగా తన క్యాజువల్ లుక్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది సుమ.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి