అందాల ముద్దుగుమ్మ సమంత,సి నాగ చైతన్య తో విడిపోయిన తర్వాత తన సినిమాల స్పీడ్ ను విపరీతంగా పెంచేసింది,  ఇప్పటికే అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప మూవీ లోని  స్పెషల్ సాంగ్ తో సమంత పాన్ ఇండియా రేంజ్ లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే సమంత  ప్రస్తుతం కూడా వరుస పెట్టి సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ గా ఉంది, అందులో భాగంగా ఇప్పటికే సమంత 'శాకుంతలం'  సినిమా షూటింగ్ ను పూర్తి చేసింది.  ప్రస్తుతం సమంత 'యశోద'  సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది,  ప్రస్తుతం యశోద మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.  

హ‌రి- హ‌రీష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ ని శ్రీదేవి మూవీస్ ప‌తాకంపై శివ‌లెంక కృష్ణ‌ ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు,  యశోద మూవీ కోసం హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో 5 కోట్ల దాకా ఖర్చు పెట్టి సర్వ హంగులతో హోటల్ సెట్ వేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చిన విషయం అందరికి తెలిసిందే, ఇలా ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా కనిపించబోతోంది, ఇది ఇలా ఉంటే యశోద సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది, యశోద సినిమాను ఆగస్టు నెలలో విడుదల చేయాలని ఉద్దేశం లో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది,  చిత్ర బృందం యశోద సినిమాను ఆగస్టు నెలలో విడుదల చేయడం కోసం ఈ సినిమా షూటింగ్ ను ప్రస్తుతం శరవేగంగా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.  ఇది ఇలా ఉంటే సమంత బాలీవుడ్ లో కూడా పలు ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది,  అలాగే సమంత ఒక హాలీవుడ్ సినిమాకు కూడా  ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: