టాలీవుడ్లో మాత్రమే కాదు మన కాజల్ అగర్వాల్ కోలీవుడ్లో కూడా ఈమె స్టార్ హీరోయినే. హీరోయిన్లలో ఈమెకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.

15 ఏళ్లుగా స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను కాపాడుకుంటూ వచ్చింది కాజల్ మాత్రమే అని చెప్పవచ్చు.అయితే ఎవ్వరూ ఊహించని విధంగా కాజల్ 2020 అక్టోబర్లో తన చిన్ననాటి స్నేహితుడు అయిన గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకుని అందరికీ కూడా షాక్ ఇచ్చింది. పెళ్ళైనప్పటికీ కూడా ఈమె సినిమాలకు గుడ్ బై చెప్పేయలేదు.

అయితే ప్రస్తుతం ఈమె ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిందే. దాంతో కొన్ని సినిమాల్లో కూడా ఈమె ఛాన్స్ లు కూడా వదులుకుంది. అందులో నాగార్జున-ప్రవీణ్ సత్తార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'ఘోస్ట్' మూవీ కూడా ఒకటి అని సమాచారం.. పెళ్ళి చేసుకుని ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్లకి ఇక సినిమా అవకాశాలు ఏమీ రావు.. కాబట్టి వాళ్ళకి సంపాదన అనేది కూడా ఉండదని ఇండస్ట్రీలో టాక్ అయితే నడుస్తుంటుంది. కానీ కాజల్ మాత్రం తన ఇన్స్టా ద్వారా ప్రెగ్నన్సీ ప్రొడక్ట్స్ వంటి వాటిని ప్రమోట్ చేస్తూ చేతినిండా సంపాదిస్తుందట.

 

ఇదిలా ఉండగా.. తాజాగా కాజల్ తన ప్రెగ్నెన్సీ అనుభవాలను షేర్ చేసుకుందట.. 'తల్లి అయ్యే భాగ్యం దక్కడం చాలా అందంగా, ఆనందంగా ఉంటుంది కానీ.. ఆ సమయంలో మనసంతా ఎంతో గజిబిజిగా ఉంటుంటుంది. అంతా మన కంట్రోల్ లోనే ఉంది అని సంతోషించే లోపే తర్వాత క్షణం ఏం జరగబోతుందో అనే టెన్షన్ కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఏ టైంలో ఏం చేయాలో, ఏమి చేస్తున్నామో కూడా తెలీదు సమయం గడిచిపోతుంటుంది.

 

మన పిల్లలను, జీవిత భాగస్వాములను ప్రేమిస్తున్నప్పుడు ఈ ఎమోషనల్ బాండింగ్ లో మనల్ని మనం మర్చిపోతుంటాం' అంటూ కాజల్‌ చెప్పుకొచ్చిందట.. కాజల్ ఇన్స్టాగ్రామ్ ఖాతాకి 21 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఇలాంటి విషయాలను షేర్ చేసుకోవడం వలన అవి ఎక్కువ మందికి చేరువవుతున్నాయి. తన బేబీ బంప్ ఫోటోలని కూడా ఈమె తెగ షేర్ చేస్తున్న విషయం తెలిసిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: