చాలా మంది సెలబ్రెటీలు తమ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలను బయటకు చెప్పడానికి పెద్దగా ఇష్టపడరు,  మీడియా ముందు చెప్పడానికి చాలా వరకు ఎక్కువ శాతం మంది సెలబ్రిటీలు అస్సలు ఇష్టపడరు.  కానీ కొంత మంది మాత్రం తమ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలను నిర్మొహమాటంగా బయటకు చెప్పేస్తూ ఉంటారు,  ఇది ఇలా ఉంటే కే జి ఎఫ్ చాప్టర్ 1 మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో దర్శకుడిగా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న  ప్రశాంత్ నీల్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక విషయాన్ని మీడియా ముందు నిర్మొహమాటంగా చెప్పేశాడు.  తాజాగా ప్రశాంత్ నీల్ మీడియాతో మాట్లాడుతూ నాకు మద్యం తాగే అలవాటు ఉంది అని బయటకు చెప్పేసాడు,   ఇది ఇలా ఉంటే తాజాగా మీడియాతో మాట్లాడిన ప్రశాంత్ నీల్ ఓ షరతుతో ఈ విషయాన్ని బయటకు చెప్తున్నాను,  నా ఇంటర్వ్యూలో ఈ భాగాన్ని  పక్కన పడేయమని నాకు మాటివ్వండి.  

నేను మద్యం తగుతాను,  మద్యం తాగుతూనే కథలు రాస్తుంటాను. నేను మత్తులో ఉన్నప్పుడు కూడా మూవీ లో  ఈ సన్నివేశాం అవసరమా ,  లేదా ,  అనేది నిర్ధారిస్తుంటాను,  ఇక్కడ కథ గురించి కాదు, దాన్ని ఎలా ప్రజెంట్‌ చేస్తున్నామనేది అత్యంత ముఖ్యమైన టాస్క్‌' అని చెప్పుకొచ్చాడు ప్రశాంత్ నీల్. ఇది ఇలా ఉంటే ప్రశాంత్ నీల్ తాజాగా దర్శకత్వం వహించిన కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా ఈ నెల 14 వ తేదిన విడుదల కాబోతుంది,  ప్రశాంత్ నీల్  'కే జి ఎఫ్ చాప్టర్ 2'  సినిమా సెట్స్ పై ఉండగానే ప్రభాస్ హీరోగా సలార్ సినిమాను ప్రారంభించాడు, సలార్ సినిమా పూర్తి అయిన తర్వాత ప్రశాంత్  నీల్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కబోయే సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: