ఆర్ఆర్ఆర్ సినిమాతో విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు తన తదుపరి సినిమా కోసం రంగం సిద్ధం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే కొరటాల శివ తో సినిమా చేయడానికి ముందుకు వెళుతున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన ఎప్పుడో రాగా ఇద్దరు కూడా వారివారి సినిమా పనుల్లో ఉండగా ఈ చిత్రం మొదలు పెట్టడానికి ఎంత సమయం పట్టింది. జూన్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు అనే విషయం తెలుస్తుంది.

కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య సినిమా ఏప్రిల్ 29వ తేదీన విడుదలకు సిద్ధం అవుతూ ఉండడంతో ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ సినిమాను మొదలు పెట్టడానికి ఆయన ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. అయితే ఇన్ని రోజులు అయినా ఈ సినిమా యొక్క షూటింగ్ మొదలు కాకపోవడంతో ఈ చిత్రం తెరకెక్కించే విషయంలో ఆలస్యం అయ్యిందని అభిమానులు టీమ్ ను త్రోల్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా యొక్క స్క్రిప్ట్ పూర్తి అయినట్లు కొరటాల శివ వెల్లడించాడు. 

ఆచార్య సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించగా కొరటాల శివసినిమా గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.  అభిమానులు ఒక్కసారిగా ఈ చిత్రం త్వరలో మొదలు కాబోతుందని దీనిని సందడి సందడి చేస్తున్నారు. పాన్ ఇండియన్ మార్కెట్ లో నిలదొక్కుకోవాలని ఎన్టీఆర్ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఈ చిత్రం ఆయనకు ఏ స్థాయిలో ఉపయోగపడుతుందో చూడాలి. హిట్ కొట్టాలన్న ఎన్టీఆర్ అభిమానుల కోరికను ఈ సినిమా ఏ స్థాయిలో తీరుస్తుందొ చూడాలి. ఇక ఈ సినిమ కూడా పాన్ ఇండియా స్థాయి లో తెరకెక్కుతున్న నేపథ్యంలో ఎన్టీఅర్ కు ఆ స్థాయి లో క్రేజ్ ఈ సినిమా ద్వారా రావడం ఖాయం అంటున్నారు. తన నటనకు ఎన్టిఆర్ కు ఎప్పుడు ఈ స్థాయి రావాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: