పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత సినిమా లకు కొంత కాలం గ్యాప్ ఇచ్చిన ఈ విషయం మనందరికీ తెలిసిందే. అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' సినిమాతో తిరిగి మళ్ళీ మూవీ లోకి  రీ ఎంట్రీ ఇచ్చాడు.  ఆ తర్వాత పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' సినిమాలో నటించాడు.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నాడు.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది.  క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.  

అలాగే ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నోరా ఫతేహి నటించబోతున్నాట్లు తెలుస్తోంది. కొంత కాలం పాటు కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది.  కొన్ని రోజుల క్రితమే తిరిగి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. పున ప్రారంభం అయిన తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమిళ హిట్ సినిమా వినోదయ సీతం తెలుగు రీమేక్ లో నటించబోతున్నట్లు అనేక రోజులుగా అనేక వార్తలు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఇది ఇలా ఉంటే ఈ రిమేక్ సినిమాను తమిళంలో దర్శకత్వం వహించిన సముద్ర ఖని నే తెలుగు లో కూడా దర్శకత్వం వహించబోతున్నట్లు కూడా అనేక వార్తలు వచ్చాయి.  ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సముద్ర కని, పవన్ కళ్యాణ్ గారి సినిమాకు  దర్శకత్వం వహించబోతున్న ఈ విషయాన్ని తెలియజేశాడు.  అలాగే అది తమిళంలో మంచి విజయం సాధించిన వినోదయ సీతం  చిత్రం కి తెలుగు రీమేక్ అని కూడా సముద్ర ఖని క్లారిటీ ఇచ్చడు.  వినోదయ సీతం సినిమాను అద్భుతంగా తెరకెక్కిస్తా అని ఈ సందర్భంగా సముద్ర ఖని తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: