కొన్నిసార్లు ప్రేక్షకులు ఆర్టిస్టులు ఇంకా టెక్నీషియన్ల బయటి ప్రవర్తనను కూడా పరిగణనలోకి తీసుకుని సినిమాలకు కొన్ని రకాల ఫలితాలు కట్టబెడుతుంటారు. బాక్సాఫీస్ దగ్గర బాగా కలిసొస్తున్నపుడు ఇక మరీ అతి చేస్తే..పరిస్థితులు ఎదురు తిరిగినపుడు ఖచ్చితంగా బొక్క బోర్లా పడాల్సి వస్తుంది.ఇప్పుడు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ పరిస్థితి కూడా ఇలాగే తయారైనట్లుగా కనిపిస్తోంది. ఆమె కొత్త సినిమా 'ధాకడ్'కు బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాభవం తప్పేట్లు లేదు. ఈ సినిమా గురించి కంగనా చెప్పుకున్న గొప్పలు అయితే అసలు అన్నీ ఇన్నీ కావు. హాలీవుడ్ సూపర్ హీరోయిన్ సినిమాల తరహాలో భారీ యాక్షన్ సీన్లతో ఈ సినిమాను తెరకెక్కించగా.. ఈ సినిమాతో ఇండియాలో తనకు 'సూపర్ ఉమన్' తరహా ఇమేజ్ వచ్చేస్తుందని కంగనా ఎంతగానో భావించింది.అలాగే ఈ సినిమా ప్రమోషన్ల సందర్భంగా హెలికాఫ్టర్లలో కూడా తిరుగుతూ.. మీడియా ముందు తనకు తాను అనేక రకాల ఎలివేషన్లు అనేవి ఇచ్చుకుంటూ చాలా అతే చేసింది కంగనా. 'మణికర్ణిక' టైంలో కూడా దర్శకుడు క్రిష్‌ను అవమానించి.. ఆ సినిమా క్రెడిట్ అంతా కూడా తనదే అన్నట్లు పోజులు కొట్టడం.. ఆ తర్వాత రాజకీయ వ్యవహారాల్లో కూడా శ్రుతి మించి మాట్లాడటం.. ఇక తన పాటికి తాను ఉన్న బాలీవుడ్ సెలబ్రెటీలను కెలికి మరీ వాళ్లను కించపరిచేలా మాట్లాడ్డం.. ఇలా చాలా అతే చేసింది కంగనా.



ఐతే ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకునో ఏమో.. ప్రేక్షకులు ఆమె సినిమాను ఇక అసలు పట్టించుకోవట్లేదు. మొదటి రోజు ఈ సినిమాకి దేశవ్యాప్తంగా వచ్చిన నెట్ వసూల్లు రూ.50 లక్షలే అని ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు.ఇక ఇదే నిజమైతే.. కంగనాకు ఇంతకంటే పరాభవం అసలు ఇంకోటి లేనట్లే. 'మణికర్ణిక' సినిమా సహా కొన్ని విజయాలతో తాను స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోనట్లుగా మాట్లాడేది కంగనా.ఆ తలబిరుసుతోనే ఆమె అనేక కాంట్రవర్శల్ కామెంట్లు చేసింది. కానీ ఇప్పుడు ఆమె సినిమాకు బాక్సాఫీస్ దగ్గర చాలా దారుణమైన వసూళ్లు వచ్చాయి. ఈ ట్రెండ్ చూస్తుంటే ఫుల్ రన్లో ఈ సినిమా రూ.5 కోట్లు కూడా వసూలు చేసేలా లేదు. అందులోనూ బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కార్తీక్ ఆర్యన్ 'భూల్ భూలయియా-2' లాంటి ఎంటర్టైనర్‌తో కంగనా సినిమా పోటీ పడింది. ఆ సినిమాకి మంచి టాక్ వచ్చింది. భారీ ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. ఇక దాని ముందు కంగనా సినిమా నిలవడం చాలా కష్టమే అనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: