కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లోను అగ్ర స్టార్ హీరో హోదా సంపాదించుకున్న అలనాటి అతి తక్కువ మంది హీరోల్లో కమల్ హాసన్ కూడా ఒకరు. ఈయన ప్రతి చిత్రం లోనూ ఎదో ఒక ప్రత్యేకత ఉండనే ఉంటుంది. ప్రయోగాత్మక పాత్రలను చేయడం లో దిట్ట కమల్, వాటిని పండించడం లోనూ ఆయనకు ఆయనే సాటి. అయితే ఈయన సినిమా విచిత్ర సోదరులు అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఇందులో కమల్ ఒక పాత్రలో చాలా పొట్టిగా లిల్లీ ఫుట్ లా కనపడి ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. అయితే ఇది ఎలా సాధ్యమైంది. ఇదేమైనా గ్రాఫిక్సా అనుకుంటే కాదు మరి ఎలా సాధ్యమైంది అని చాలామందే అనుకుని ఉంటారు. అసలు కమల్ ఇంత పొట్టిగా మరగుజ్జులా కనిపించడానికి ఏమి చేశారు, ఆ పాత్ర వేయడానికి ఎంత కష్టపడ్డారు అన్నది ఇపుడు తెలుసుకుందాం.

సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం అందించిన ఈ చిత్రం ప్రత్యేకతను సంతరించుకుంది. అమావాస్య చంద్రుడు సినిమా అనంతరం కమల్ హాసన్ మరియు సింగీతం శ్రీనివాసరావు కాంబోలో మరో చిత్రం ఉండాలని భావించి ఆచరణలో పెట్టగా ఈ అద్భుతమైన 'విచిత్ర సోదరులు' చిత్రం ప్రేక్షకుల  ముందుకు వచ్చింది. కథలో మరగుజ్జు పాత్ర కీలకమని చెబుతూ కాన్సెప్ట్ ని వివరించగా లైన్ సూపర్ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కమల్. కమల్ హాసన్ ను పొట్టిగా చూపించడానికి చాలా సీన్ల కోసం కేవలం నడుము వరకు తీసి ఆ తరవాత ఎడిటింగ్ లు గట్రా చేసి సీన్ లను షూట్ చేశారు.  18 అంగుళాల స్పెషల్ షూను తొడిగించి స్క్రీన్ పై కమల్ ను పొట్టివాడిగా చూపించారు.  


కమల్ ను నేలపై చూపించే సమయంలో కాళ్లను భూమిలో పాతి పెట్టిన షూట్ చేశారట.  జపాన్ అనే సెట్ బాయ్ ఈ షూటింగ్ కు సంబందించిన విషయాలను దగ్గరుండి జాగ్రత్తగా చూసుకున్నాడు.  అంతే కాకుండా కమల్ ను పొట్టిగా చూపించడానికి మేకప్ విషయం లోను చాలా కష్టపడ్డారట టీం. అయితే మేకప్, ఎడిటింగ్ ఇవన్నీ పక్కన పెడితే ఒక మరగుజ్జుగా కమల్ ఫీల్ అవుతూ చేసిన నటన మహా అద్భుతం గా పండింది.

మరింత సమాచారం తెలుసుకోండి: