ఆ సమయంలో తనకు ఎదురైన కొన్ని విషయాలను కావేరి మాట్లాడుతూ.. అల్లు అర్జున్ ని కలవడానికి ముందే మేనేజర్లు 42 కండిషన్లతో కూడినటు వంటి ఒక జాబితాను ఇస్తారని అవి చాలా కఠినంగా ఉంటాయని హీరో కళ్ళలోకి నేరుగా చూడకూడదు, షేక్ హ్యాండ్ వంటివి ఇవ్వకూడదు. తగినంత దూరం పాటించాలని నిబంధనలు కూడా ఉన్నాయంటూ ఆమె ఆరోపణలు చేశారు, అలాగే షూటింగ్ సెట్లో హీరో ఉన్నప్పుడు ఎవరు కూడా ఫోన్ వాడకూడదనే నిబంధన ఉందని, అలా మొబైల్ చూస్తూ ఉంటే బన్నీ బాడీగార్డ్స్ వచ్చి తన చేతిలో నుంచి మొబైల్ లాగేసుకున్నారు అంటూ ఆమె ఆరోపణలు చేసింది.
ఈ విషయాల పైన అల్లు అర్జున్ టీమ్ స్పందిస్తూ.. కావేరి బారువ చేసిన ఆరోపణలు నిజం కాదు అవన్నీ అవాస్తవాలే అంటూ మంగళవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. అల్లు అర్జున్ ఎప్పుడూ కూడా చాలా హుందాగా, గౌరవప్రదంగానే వ్యవహరిస్తారని ఆయనతో పనిచేసిన దర్శకులు, కో ఆర్టిస్టులు, బ్రాండ్ ప్రతినిధులు ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కేవలం ప్రచారం లేదా వ్యక్తిగత కారణాలతోనే ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదు అంటూ అల్లు అర్జున్ తెలియజేసింది. అల్లు అర్జున్ మీద చేసిన ఈ ఫేక్ న్యూస్ తీవ్రంగా పరిగణిస్తున్నామంటూ తెలియజేసింది. వీరి పైన పరువు నష్టం కేసు వేయడానికి తమ టీమ్ లీగల్గా సిద్ధంగా ఉందని తెలిపారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి