ఈ సినిమా కోసం హీరో నిఖిల్ కూడా చాలా కష్టపడ్డారని చెప్పవచ్చు. ఇందులో హీరోయిన్గా సంయుక్త మీనన్ నటిస్తోంది. అలాగే మరో హీరోయిన్ నభ నటేష్ , సునీల్, సుబ్బరాజు తదితర నటీనటులు నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి టీజర్ ని విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది.ఈ టీజర్ కనుక పరిశీలిస్తే బాహుబలి సినిమా లాగా పోలి ఉన్నట్లుగా ఇందులో కొన్ని సీన్స్ కనిపిస్తున్నాయి. భారీ సెట్స్ అద్భుతమైన విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. హీరో నిఖిల్ చెప్పే డైలాగ్ బలం ఏదో ఒకచోట నశిస్తుంది మిత్రమా కానీ... తెగింపు ఎంత దూరమైనా తీసుకెళ్తుంది అని చెప్పే డైలాగ్ టీజర్ కే హైలైట్ గా ఉంది.
స్వయంభు చిత్రాన్ని భారతీయ భాషలలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేసేలా చూస్తున్నారు. ముఖ్యంగా చైనీస్, స్పానిష్, అరబిక్ వంటి భాషలలో కూడా విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి బాహుబలి సినిమాకి పనిచేసిన కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫీగా పనిచేశారు. ఇక సంగీతాన్ని కేజిఎఫ్ సినిమాకి అందించిన రవి బస్రూర్ అందించారు. ఈ సినిమా కోసం హీరో నిఖిల్ సుమారుగా రెండేళ్లకు పైగా ఆయుధ విద్యలలో శిక్షణ తీసుకున్నట్లు తెలుస్తోంది. నిఖిల్ పడిన కష్టం మొత్తం కూడా టీజర్ లోనే కనిపిస్తుంది. కార్తికేయ 2 సినిమా తర్వాత మరోసారి సక్సెస్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి