ఏపీలో కూటమిలో భాగంగా ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం తమ విధివిధానాలను నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇటువంటి తరుణంలోనే ఏపీ మంత్రులకు తాజాగా బెదిరింపు లేఖలు రావడం సంచలనంగా మారింది. ముఖ్యంగా నలుగురు మంత్రులకు ఇలా బెదిరింపు లేఖలు వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ లేఖలు మావోయిస్టుల పేరుతో హెచ్చరికల నేపథ్యంలో ఈ లేఖలు వచ్చినట్లుగా సమాచారం.


మొదట కందుల దుర్గేష్ కు ఈ లేఖ రాగా, తుళ్లూరు పోలీస్ స్టేషన్ కి వెళ్లి మరి ఫిర్యాదు చేశారు. అలాగే అనగాని సత్యప్రసాద్, సత్య కుమార్, కొల్లు రవీంద్ర వంటి మంత్రులకు కూడా  ఇదే తరహాలోనే లేఖలు రావడం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ లేఖలు ఎవరు రాశారు? మావోయిస్టుల పేరుతో ఎందుకు రాశారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఒకే విధమైనటువంటి సందేశం తో పలువురు మంత్రులకు లేఖలు రాయడం వెనుక అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భద్రతా ఏర్పాట్ల పైన ప్రభుత్వం మరింత జాగ్రత్తలు తీసుకోనే అవకాశం ఉన్నట్లు సమాచారం.


ఏపీలో  బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న వేళ మంత్రులకు బెదిరింపు లేఖ అంశంపై కందుల దుర్గేష్ స్పందిస్తూ.. ఇలాంటి లేఖల వల్ల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని ఎవరో ఉద్దేశపూర్వకంగానే రాసి ఉంటారని అభిప్రాయిస్తున్నామంటూ తెలిపారు. మావోయిస్టులు రాసే లేఖలు ఇలా ఉండవని తాను పర్యవేక్షిస్తున్న టూరిజం శాఖ చాలా చిన్నది, అటు వ్యక్తిగతంగా ,శాఖా పరంగా కూడా ఎక్కడ తప్పులు ఉండవని, మావోయిస్టులు లేఖ రాయాల్సినంత హడావిడి ఏమి ఉండదు అంటూ తెలియజేశారు. ఈ లేఖల పైన కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారని ఈ లేఖ ఎక్కడి నుంచి వచ్చింది? అనే అంశం పైన ఆరా తీస్తున్నారు. ఒకవేళ ఇది నిజంగానే మావోయిస్టులు పంపించారా? లేకపోతే ఎవరైనా ఆకతాయిలు చేసిన పనేనా అనే కోణంలో విచారిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: