తన మొదటి చిత్రం అర్జున్ రెడ్డి సినిమా తో ముంబై బ్యూటీ షాలిని మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంతో అందుకున్న క్రేజ్ మొత్తం ఆ అమ్మడు కెరియర్ పై ఆశించిన విధంగా సాగ లేకపోయింది. అవకాశాలు అయితే వస్తున్నాయి కానీ వాటిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోలేక పోతోంది షాలిని. మహానటి ఎన్టీఆర్, కథానాయకుడు వంటి చిత్రాలలో చిన్న చిన్న పాత్రలో నటించినప్పటికీ ఆమెకు పెద్దగా గుర్తింపు         తేలేకపోయాయి. ఇక ఆ తర్వాత 118, ఇద్దరి లోకం ఒకటే, నిశ్శబ్దం వంటి సినిమాలలో నటించిన కూడా ఇవేవి ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు.


కానీ ఈ మధ్య మధ్యలో కోలీవుడ్, తమిళ ఇండస్ట్రీ లోకి వెళ్లి అక్కడ కూడా కొన్ని సినిమాల్లో నటించింది కానీ అక్కడ కూడా ఫేమస్ కాలేకపోయింది షాలిని. ఈమె సినిమా తెలుగు ఇండస్ట్రీలో విడుదలై ఇప్పటికి 2 సంవత్సరాలు కావస్తోంది చివరిగా "నిశ్శబ్దం" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ తర్వాత తెలుగు తమిళంలో అసలు అవకాశాలు రాలేదు. ప్రస్తుతం బాలీవుడ్లో మాత్రం" మహారాజు" అనే చిత్రంలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం ఈమె చేతిలో ఈ ఒక్క సినిమా మాత్రమే ఉన్నది దీంతో ఈ అమ్మడు ఆశలన్నీ ఈ చిత్రంపైనే ఉన్నట్లుగా కనిపిస్తోంది.

ఒక వేళ సినిమా హిట్ అయితే మరొక ఛాన్స్ ఉంటుంది.. ఇక ఇటీవలే ఈమె నటించిన మరొక చిత్రం.. "జెయేష్ భాయ్ జోర్డన్" సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాగా ఇది కూడా ఫ్లాప్ గా నిలిచింది. ఇందులో హీరోగా రణవీర్ సింగ్ నటించారు. ఇందులో ఈమె నటన బాగా ఉన్నప్పటికీ ఈ సినిమా అంతగా తన కెరియర్ పై ప్రభావం చూపలేదు. ఇక టాలీవుడ్ లో ఇన్ని సంవత్సరాలు గ్యాప్ ఇస్తే కష్టమే అంటున్నారు నెటిజెన్స్. ప్రస్తుతం యువ హీరోయిన్ల పోటీపడి మరీ నటిస్తున్నారు. మరి ఈమెకు అవకాశాలు వస్తాయేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: