లోకనాయకుడు కమల్ హాసన్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కమల్ హాసన్ తన కెరీర్ లో ఇప్పటి వరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి నటుడిగా ఎంతో గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాడు. ఇలా నటుడి గా ఎంతో గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న కమల్ హాసన్ 'విశ్వరూపం' సినిమా తర్వాత వెండి తెరపై ప్రేక్షకులను అలరించలేకపోయింది. 

విశ్వరూపం సినిమా తర్వాత భారతీయుడు 2 మూవీ ని మొదలు పెట్టిన కమల్ హాసన్ అనివార్య కారణాల వల్ల ఆ సినిమా సినిమా కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఆగిపోయింది. ఇది ఇలా ఉంటే కమల్ హాసన్ భారతీయుడు 2 సినిమా ఆగిపోయిన తర్వాత విక్రమ్ సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాకు మానగరం, ఖైదీ, మాస్టర్ సినిమా లతో దర్శకుడిగా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు యంగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించాడు.  ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫాహాద్ ఫాజిల్ ముఖ్య పాత్రలో నటించగా,  సూర్య గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడు.

ఇది ఇలా ఉంటే విక్రమ్ సినిమా  తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు అనగా మే 31 వ తేదీన సాయంత్రం 6 గంటలకు శిల్పకళా వేదిక హైదరాబాద్ లో జరగబోతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ను చిత్ర బృందం ఇది వరకే ప్రకటించింది.  ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ కు టాలీవుడ్  సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్ చీఫ్ గెస్ట్ గా రానున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది .విక్రమ్ సినిమా జూన్ 3 వ తేదీన తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: