నజ్రియా మాట్లాడితు.. కథల ఎంపిక విషయంలో తాను కొంచెం పర్టిక్యులర్ గా ఉంటాను అయితే చాలామంది నేను.. ప్రతిరోజు కథలు వింటూ రిజెక్ట్ చేస్తూ ఉంటాను అని అనుకుంటు ఉంటారు అందులో అసలు నిజం లేదు కొన్ని కథలు మాత్రమే వింటాను అందులో అంటే సుందరానికి చాలా ఎగ్జైటింగ్గా ఫీలయ్యాను కాబట్టే కథ విన్నప్పుడు భాష గురించి ఆలోచించకుండా సగటు ప్రేక్షకుడిలా ఈ కథను ఎంపిక చేసుకున్నానని తెలియజేసింది. కథ పరంగా అద్భుతంగా ఉందని ఫన్ ఎంటర్టైన్మెంట్ ,ఎమోషన్ ఇలా ఎన్నో ఈ చిత్రం లో సమకూర్చడంతో ఈ సినిమాని ఒప్పుకున్నానని తెలియజేసింది నజ్రియా.
చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ మొదలుపెట్టాను ఇప్పటివరకు ఎన్నో టీవీ లో పని చేశాను ఒక రెండేళ్లు వరుసగా సినిమాలు చేశాను.. అంతే త్వరగానే వివాహం చేసుకున్నాడు తన వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన తర్వాత దానికి ఎక్కువ సమయాన్ని కేటాయించడం మొదలు పెట్టానని తెలియజేసింది. తనకి ఎక్కువగా ఇంటి పనులు చేసుకోవడమే ఆనందాన్ని కలిగిస్తోందని తెలిపింది. తన భర్తకు తనని తెరమీద చూడటం చాలా ఆనందాన్నిస్తుందని తెలిపింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి