టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినా దగ్గుబాటి రానా గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దగ్గుబాటి రానా కొంత కాలం క్రితమే భీమ్లా నాయక్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకొని మంచి ఫామ్ లో ఉన్నాడు.

అలా భీమ్లా నాయక్ విజయంతో మంచి జోష్ లో ఉన్న దగ్గుపాటి రానా తాజాగా నటించిన విరాట పర్వం సినిమా కొన్ని రోజుల క్రితమే విడుదల అయ్యింది. ఈ సినిమాలో రానా సరసన సాయి పల్లవి కథానాయికగా నటించగా, మరో కీలకమైన ముఖ్య పాత్రలో ప్రియమణి కూడా నటించింది. ఈ సినిమాకు వేణు ఉడుగుల దర్శకత్వం వహించగా ఈ సినిమాకు సురేష్ బెబ్బులి సంగీతాన్ని సమకూర్చాడు. జూన్ 17 వ తేదీన మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన విరాట పర్వం సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. ఇలా ప్రేక్షకుల నుండి ఈ సినిమాకు మంచి ఆదరణ లభించడంతో ప్రస్తుతం ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల కూడా బాగానే వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాపై తమిళ్ క్రేజీ దర్శకుడు అయిన పా రంజిత్ ప్రశంసల వర్షం కురిపించాడు. తమిళ దర్శకుడు పా రంజిత్ తన సోషల్ మీడియా ద్వారా సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు.

దర్శకుడు పా రంజిత్ సోషల్ మీడియా వేదికగా...  విరాట పర్వం మూవీ ఇటీవలి కాలంలో నేను చూసిన ఉత్తమ తెలుగు సినిమా. నిర్మాతలు మరియు దర్శకుడు వేణు ఉడుగుల విరాట పర్వం మూవీ ని ఎలాంటి రాజీ లేకుండా తీసినందుకు చాలా ప్రశంసలు అందుకోవాలి. ఈ పాత్రను అంగీకరించి మరియు చేసినందుకు దగ్గుబాటి రానా కు ప్రత్యేక అభినందనలు మరియు సాయి పల్లవి అద్భుతంగా నటించింది అంటూ దర్శకుడు పా రంజిత్ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: