'హీరో' రిలీజ్‌ టైమ్‌లో నిధి అగర్వాల్ పేరు మారుమోగిపోయింది. నిధి అగర్వాల్‌ ఎక్కడ కనిపిస్తే అక్కడ అభిమానుల హంగామా కనిపించింది. అయితే ఇంత ఫాలోయింగ్‌ ఉన్నా నిధి ఇప్పటికీ స్టార్‌ లీగ్‌లో చోటు దక్కించుకోలేకపోతోంది. 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత నిధి చేసిన 'ఈశ్వరన్, భూమి, హీరో' సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర బోల్తాపడ్డాయి.

నిధి అగర్వాల్‌ ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌తో 'హరిహర వీరమల్లు' సినిమా చేస్తోంది. క్రిష్ దర్శకత్వంలో హిస్టారికల్‌ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాపై మంచి బజ్‌ ఉంది. ఇక ఫస్ట్‌ టైమ్‌ టాప్‌ హీరోతో చేస్తోన్న ఈ సినిమాతో టాప్‌ లీగ్‌లో అడుగుపెట్టొచ్చని ఆశ పడుతోంది నిధి అగర్వాల్. మరి పవన్‌ కళ్యాణ్‌ నిధికి బ్లాక్‌ బస్టర్ ఇస్తాడా  అన్నది చూడాలి.

అనూ ఇమ్మాన్యుయేల్‌ కెరీర్ బిగినింగ్‌లోనే స్టార్‌ హీరోస్‌తో సినిమాలు చేసింది. పవన్‌ కళ్యాణ్‌తో 'అజ్ఞాతవాసి', అల్లు అర్జున్‌తో 'నాపేరు సూర్య' సినిమాలు చేస్తోన్న టైమ్‌లో చాలామంది అనూ ఇమ్మాన్యుయేల్‌ స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకున్నారు. కానీ ఈ రెండూ డిజాస్టర్ కావడంతో అను కెరీర్‌కి బ్రేకులు పడ్డాయి. మెయిన్‌ హీరోయిన్ స్టేజ్‌ నుంచి సెకండ్‌ హీరోయిన్‌కి పడిపోయింది.

అనూ ఇమ్మాన్యుయేల్ రీసెంట్‌గా 'అల్లుడు అదుర్స్, మహాసముద్రం' సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గా చేసింది. అయితే ఈ సినిమాలు రెండూ ఫ్లాప్ అయ్యాయి. అనూ ఇమ్మాన్యుయేల్‌ మరీ సపోర్టింగ్ ఆర్టిస్ట్ స్థాయిలో కనిపించిందనే కామెంట్స్ వచ్చాయి. ఈ కష్టకాలంలో అల్లు శిరీష్‌తో 'ప్రేమకాదంట', రవితేజతో 'రావణాసుర' సినిమాలు చేస్తోంది అనూ ఇమ్మాన్యుయేల్.

ఇండస్ట్రీలో హిట్లు, ఫ్లాపులు చాలా కామన్. సినిమా సినిమాకి గ్రాఫ్ మారుతూనే ఉంటుంది. అయితే హీరోయిన్లకి మాత్రం వరుసగా రెండు ప్లాపులు వస్తే చాలు, కెరీర్‌కి బ్రేకులు పడతాయి. ఫామ్‌లో లేదని స్టార్ హీరోలు పక్కనపెట్టేస్తారు. ఫ్లాపుల్లో ఉందని యంగ్‌స్టర్స్‌ కూడా సైడ్‌ చేస్తారు. ఇప్పుడు కొంతమంది బోల్డ్‌ బ్యూటీస్‌ ఇలాంటి స్టేజ్‌లోనే ఉన్నారు.

'ఇస్మార్ట్ శంకర్‌'తో నభా నటేశ్‌కి మంచి క్రేజ్ వచ్చింది. మాసీ క్యారెక్టర్‌లో అదరగొట్టిందనే కాంప్లిమెంట్స్‌ తెచ్చుకుంది. అయితే ఆ తర్వాత నభాకి సరైన హిట్‌ రాలేదు. 'డిస్కోరాజా, అల్లుడు అదుర్స్' సినిమాల ఫ్లాపులతో నభా కెరీర్‌ కూడా స్లో అయ్యింది. ఇక ఓటీటీలో రిలీజైన 'మ్యాస్ట్రో' కూడా నభాకి బూస్టప్ ఇవ్వలేదు. దీనికితోడు నభాకి కొత్తగా అవకాశాలు కూడా రాట్లేదు.

ఫస్ట్ మూవీ 'ఆర్.ఎక్స్.100'తో సిల్వర్‌ స్క్రీన్‌కి రొమాంటిక్ ఝలక్ ఇచ్చింది పాయల్ రాజ్‌పుత్. అయితే ఈ మూవీలో బోల్డ్‌ క్యారెక్టర్‌తో యూత్‌కి కనెక్ట్ అయిన పాయల్‌కి ఆ తర్వాత వరుస ఫ్లాపులొచ్చాయి. 'ఆర్.డి.ఎక్స్.లవ్, వెంకీమామ, డిస్కోరాజా' ఫ్లాపులతో పాయల్‌ కెరీర్‌ కూడా స్లో అయ్యింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఆది సాయికుమార్‌తో కలిసి 'కిరాతక' అనే సినిమా చేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: