ఇండియా వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయిన మణిరత్నం ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో హేమాహేమీలు నటీనటులు అయిన విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష ప్రముఖ పాత్రల్లో కనిపించబోతున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి విక్రమ్ , కార్తీ , ఐశ్వర్య రాయ్ , త్రిష లకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లకు సంబంధించి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ సినిమాను సెప్టెంబర్ 30 వ తేదీన తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ టీజర్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటం మాత్రమే కాకుండా భారీ రేంజ్ లో ఈ సినిమా కోసం వి ఎఫ్ ఎక్స్ వాడినట్లు కూడా తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో భారీ యుద్ధ సన్నివేశాలు కూడా ఉండబోతునట్లు తెలుస్తోంది. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కబోతోంది.

సెప్టెంబర్ 30 వ తేదీన మొదటి భాగం విడుదల కాబోతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. అసలు విషయంలోకి వెళితే ... ఈ మూవీ అన్ని భాషల ఆడియో హక్కులను ప్రముఖ ఆడియో సంస్థ టిప్స్ మ్యూజిక్ వారు సొంతం చేసుకోగా దీనికి భారీ ధర వారు ఇచ్చినట్టు తెలుస్తుంది. 24 కోట్లు చెల్లించి టిప్స్ మ్యూజిక్ సంస్థ ఈ సినిమా హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: