జబర్దస్త్.. ఈ కామెడీ షో గురించి ప్రత్యేకంగా కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎంతోమంది బుల్లితెర ప్రేక్షకుల ఇంట్లో జబర్దస్త్ అనే కార్యక్రమం ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. జబర్దస్త్ కార్యక్రమం ప్రసారం అవుతుంది అంటే చాలు ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టేసి టీవీలకు అతుక్కుపోతుంటారు. ఎందుకంటే జబర్దస్త్ లో కమెడియన్స్ చేసే కామెడీతో కడుపుబ్బా నవ్వు కోవచ్చు అని చిన్న ఆశ. రోజంతా ఎంతో టెన్షన్ తో ఉన్న జబర్దస్త్ చూసి ఎంతగానో ఉపశమనం పొందుతూ ఉంటారు బుల్లితెర ప్రేక్షకులు. అందుకే జబర్దస్త్ కార్యక్రమం ప్రారంభమయ్యే ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది అని చెప్పాలి.


 అయితే ఇక జబర్దస్త్ కమెడియన్స్ ఇటీవల కాలంలో ఏకంగా సొంత ఫ్యామిలీ మెంబర్స్ ను కూడా స్కిట్ లలో భాగం చేసుకుంటూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల నుంచి జబర్దస్త్ లో బుల్లెట్ భాస్కర్ తండ్రి ఎంతగానో సందడి చేస్తూ ఉన్నారు. ఇక ఇటీవల జబర్దస్త్ కు సంబంధించిన ప్రోమో విడుదలై సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఈ ప్రోమో లో భాగంగా రాకింగ్ రాకేష్ ఏకంగా తన సొంత వైఫ్ ని జబర్దస్త్ స్కిట్ లోకి తీసుకు వచ్చేశాడు. ఈ క్రమంలోనే ఇద్దరు కలిసి స్కిట్ లో పంచులతో అందరినీ కడుపుబ్బ నవ్విస్తారు.


 స్కిట్ పూర్తయిన తర్వాత మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని అడుగుతుంది జడ్జ్ ఇంద్రజ. అయితే మాది లవ్ మ్యారేజ్ అంటూ చెప్పి ఇక వారి పెళ్లికి ముందు జరిగిన ప్రేమ కథను వివరిస్తాడు రాకింగ్ రాకేష్. ఇక ఆ తర్వాత మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అంటూ జడ్జ్ ఇంద్రజ ను  అని అడుగుతాడు. దీంతో షాకింగ్ విషయాలు చెప్పింది ఇంద్రజ. మా పెళ్ళికి కేవలం 13 మంది మాత్రమే వచ్చారు. హీరోయిన్ గా ఉన్నప్పటికీ నా పెళ్ళికి ఖర్చయింది మాత్రం కేవలం 7500 రూపాయలు మాత్రమే అంటూ ఇంద్రజ చెబుతుంది. దీంతో అందరూ షాక్ అవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: