యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తాజాగా ది వారియర్ మూవీ లో కథానాయకుడిగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ఆది పినిశెట్టి ప్రతి నాయకుడి పాత్రలో నటించగా ,  లింగుసామి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో రామ్ పోతినేని సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా ,  దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా జూలై 1 4వ తేదీన తెలుగు,  తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల అయ్యింది.

మొదటి నుండి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండటంతో ఈ మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్ లు నమోదు అయ్యాయి. కాకపోతే ఈ సినిమాకు బాక్సా ఫీస్ దగ్గర మొదటి రోజే మిక్సీడ్ టాక్ రావడంతో ఓవరాల్ గా ఈ సినిమా అనుకున్న రేంజ్ కలెక్షన్ లను బాక్సా ఫీస్ దగ్గర రాబట్టలేకపోయింది.

మొదటి నుండి ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్న కారణంగా ది వారియర్ మూవీ దాదాపుగా ప్రపంచ వ్యాప్తంగా 38 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకొని , 39 కోట్ల భారీ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇప్పటి వరకు 14 రోజుల బాక్సా పీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న ది వారియర్ మూవీ 21.38 కోట్ల షేర్ , 36.90 కోట్ల గ్లాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. వీటితో చూసుకుంటే ఇంకా 17.62 కోట్ల షేర్ కలెక్షన్ లను బాక్సా ఫీస్ దగ్గర ది వారియర్ మూవీ రాబట్టగలిగినట్లయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఈ మూవీ ఏ రేంజ్ కలెక్షన్ లను బాక్సా ఫీస్ దగ్గర పడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: