‘కేజీ ఎఫ్ 2’ మ్యానియాతో యష్ ఇమేజ్ ఒకేసారి తారా స్థాయికి చేరిపోయింది. ఒక కన్నడ హీరో పాన్ ఇండియా హీరోగా మారిపోవడంతో అతడి వద్దకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అయితే ఈ ఆఫర్లను పట్టించుకోకుండా యష్ తన భార్యా పిల్లలతో ప్రస్తుతం యూరప్ లో ఉన్నాడు. సాధారణంగా హీరోలు ఒకసినిమా బ్లాక్ బష్టర్ హిట్ అయినతరువాత తన దగ్గరకు వచ్చే నిర్మాతల నుండి అడ్వాన్స్ లు తీసుకుని ఆతరువాత కథల గురించి ఆలోచనలు చేస్తారు.


అయితే యష్ ప్రస్తుతం దీనికి భిన్నంగా వ్యవహరిస్తూ తన దగ్గరకు వచ్చి కథలు చెపుతామని ప్రయత్నిస్తున్న ఏ దర్శకుడుకి అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదట. దీనితో యష్ ఇప్పట్లో మరొక సినిమాను చేసే ఉద్దేశ్యంలో లేదా అంటూ ఊహాగానాలు మొదలైపోయాయి. కన్నడ మీడియా వ్రాస్తున్న ఊహాగానాల ప్రకారం యష్ ఇలా ప్రవర్తించడానికి ఒక కారణం ఉంది అని అంటున్నారు.


అంతేకాదు యష్ కు ప్రభాస్ సమస్యలు వెంటాడుతున్నాయని టాక్. ‘బాహుబలి’  తరువాత ప్రభాస్ ‘సాహో’ లాంటి భారీ యాక్షన్ మూవీలో నటించినప్పటికీ జనానికి నచ్చలేదు. దీనితో లవ్ స్టోరీ వైపుకు వెళ్ళి 'రాథే శ్యామ్’ లో నటించాడు ఆసినిమా ఫ్లాప్. ప్రభాస్ నుండి వచ్చే ప్రతి సినిమా 'బాహుబలి’ లా ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఇప్పుడు యష్ పరిస్థితి కూడ అలాగే ఉంది అంటున్నారు.


‘కేజీ ఎఫ్ 2’ తరువాత యష్ లవ్ స్టోరీలో నటించాల లేదంటే యాక్షన్ మూవీలో నటించాలా అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. యష్ నుండి రాబోయే సినిమా ‘కేజీ ఎఫ్ 2’ మించిన స్థాయిలో ఉండాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ‘కేజీ ఎఫ్ 2’ దర్శకుడు ప్రస్తుతం ఖాళీగా లేదు. దీనితో ఎవరో ఒక దర్సకుదుని యష్ ఎంచుకోవాలి. దీనికితోడు మంచి కథ దొరకాలి. ఇవన్నీ జరిగే వరకు యష్ తన తదుపరి సినిమా ప్రారంభించే పరిస్థితి లేదు అన్న మాటలు వినిపిస్తున్నాయి..




మరింత సమాచారం తెలుసుకోండి: