ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇక ఇటీవలే త్రిబుల్ ఆర్ సినిమా తో ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే జూనియర్ ఎన్టీఆర్కు 2011 మే 5వ తేదీన పెళ్లి జరిగింది. లక్ష్మీప్రణతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని వైవాహిక బంధం లోకి అడుగుపెట్టాడు ఎన్టీఆర్. ఇక వీరి మధ్య ఎలాంటి గొడవలు లేకుండా ఎప్పుడూ అన్యోన్య దంపతులుగా ఉంటారు. వీరి దాంపత్య బంధానికి గుర్తుగా ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రణతి ఎంతో హుందాగా వుంటూ అభిమానుల గౌరవాన్ని సంపాదించుకోవడమే కాదు మరోవైపు కుటుంబ సభ్యులకు బాగోగులు కూడా చూసుకుంటుంది.


 ఇలా మంచి తల్లిగా.. మంచి భార్యగా.. మంచి కోడలిగా గొప్ప మహిళా మణిగా పేరు సంపాదించుకుంది. అయితే 2011లో ఎన్టీఆర్ లక్ష్మీప్రణతి వివాహం వెనుక ఒక పెద్ద కథ నడిచింది అనే విషయం చాలా మందికి తెలియదు. అదేంటి ఎన్టీఆర్ ది పెద్దలు కుదిర్చిన పెళ్లి కదా ఇక వెనకాల పెద్ద కథ నడవడానికి  కారణం ఏముంది అని అంటారా.. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఎన్టీఆర్ కి ఇంట్లో వాళ్ళు సంబంధాలు చూస్తున్నారు.  ఆ సమయంలో ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ అధినేత కూతురుని ఎన్టీఆర్ కు ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారట. అయితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఎన్టీఆర్ వేరొకరి ఇంటికి అల్లుడు అవ్వడం ఇష్టం లేక స్వయంగా ఆయనే రంగంలోకి దిగాడట.


 ఈ క్రమంలోనే సీనియర్ ఎన్టీఆర్ మేనకోడలు కుమార్తెను ఎన్టీఆర్ కి ఇచ్చి పెళ్లి చేయాలని చంద్రబాబు భావించారు. ఆయనే స్వయంగా వెళ్లి ఇరు కుటుంబ సభ్యులతో మాట్లాడి పెళ్లికి పెద్దగా వ్యవహరించారట. అయితే లక్ష్మీ ప్రణతిది కూడా బాగా డబ్బున్న కుటుంబం కావడం గమనార్హం. ఇక ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి ఒకరిని ఒకరు ఓకే చేయడంతో చివరికి పెద్దలు ముహూర్తం ఫిక్స్ చేశారు. పెళ్లి జరిగే సమయంలో లక్ష్మీప్రణతి కి మైనారిటీ ఉందని ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ 18 ఏళ్లు నిండిన తర్వాత ఆమెకు పెళ్లి చేశారు. పెళ్లి తో పాటు కోట్ల రూపాయల కట్నకానుకలు కూడా తీసుకు వచ్చిందట లక్ష్మీప్రణతి. ఇలా లక్ష్మీప్రణతి ఎన్టీఆర్ పెళ్లి జరగడానికి వెనుక ఏకంగా స్వయంగా చంద్రబాబు నాయుడు కథ నడిపించారట.

మరింత సమాచారం తెలుసుకోండి: