ఇక కొన్ని రోజులుగా వరుస ఫ్లాపులని ఎదుర్కుంటున్న టాలీవుడ్ కి ఇటీవల రిలీజ్ అయిన బింబిసార ఇంకా సీతారామం వంటి మంచి కంటెంట్ వున్న సినిమాలు మంచి హిట్ కొట్టి ఊపిరి పోశాయి.గత శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమాలు మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొని మంచిగా వసూళ్లు రాబడుతూ చాలా విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శించబడుతున్నాయి.2 నెలలు నుంచి ఒక్క హిట్ లేక సత మతం అవుతున్న టాలీవుడ్ కి ఈ సినిమాలు ఒక్కసారిగా ప్రాణం పోసాయి. దీంతో నిర్మాతలు ఇంకా అలాగే డిస్ట్రిబ్యూటర్లు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.దీంతో టాలీవుడ్ ప్రముఖులంతా ఈ సినిమాలని ఇంకా అలాగే చిత్ర యూనిట్స్ ని బాగా అభినందిస్తున్నారు. రెండు చిత్ర యూనిట్స్ కూడా సక్సెస్ మీట్స్ నిర్వహిస్తున్నాయి. ఇక సినీ పరిశ్రమ సమస్యలని పరిష్కరించడానికి ముందుండి నడిపిస్తున్న అగ్ర నిర్మాత అయిన దిల్ రాజు కూడా తాజాగా బింబిసార సక్సెస్ మీట్ లో పాల్గొని ఈ రెండు సినిమాల సక్సెస్ పై ఆయన మాట్లడారు.


బింబిసార సినిమా సక్సెస్ మీట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ”ఆగస్టు 1 వ తేదీ నుంచి సినిమా షూటింగ్స్ లు నిలిపివేసి భవిష్యత్ కోసం అనేక ఆలోచనలు చేస్తున్నాం. జూన్ నెలలో విక్రమ్, మేజర్ సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. ఇక ఆ తర్వాత నుంచి ఒక్క సినిమా కూడా సరిగ్గా ఆడలేదు, జనాలు థియేటర్లకు అస్సలు రావడం లేదు. ఆగస్టు నెలలో బింబిసార ఇంకా సీతారామం సినిమాలు అయితే ఇండస్ట్రీకి ఊపిరిపోశాయి. మన సినీ పరిశ్రమ చాలా ఇబ్బందుల్లో ఉందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. సినిమా ఇండస్ట్రీ కష్టకాలంలో ఉన్న సమయంలో దర్శకుడు వశిష్ట ఇండస్ట్రీకి మంచి హిట్ ఇచ్చాడు. ఒక సినిమాకు దర్శకుడు, నిర్మాత ఇంకా అలాగే హీరోనే చాలా ముఖ్యం. ఈ ముగ్గురు ఉంటేనే సినిమాని ఏ స్థాయికైనా కూడా తీసుకెళ్లొచ్చు” అని దిల్ రాజు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: