టాలీవుడ్‌లో ఐకాన్‌ స్టార్‌ హీరో గా వెలుగొందుతున్నాడు (Allu Arjun). ముఖ్యంగా పుష్ప సినిమా తర్వాత పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు ఈ స్టార్‌ హీరో.



తన నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టైలిష్ స్టార్‌ మరోవైపు వాణిజ్య ప్రకటనలతోనూ కోట్లు గడిస్తున్నాడట.. ఇప్పటికే పలు కంపెనీల ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.. ఈక్రమంలో ఒక్కోయాడ్‌కు రూ7.5 కోట్ల రెమ్యునేషన్‌ తీసుకుంటాడని తెలుస్తోంది. ఈక్రమంలో అల్లు అర్జున్‌ కున్న క్రేజ్‌ను ఓ గుట్కా అండ్‌ లిక్కర్‌ కంపెనీ కూడా వినియోగించుకోవాలనుకుందని సమాచారం.తమ సంస్థ బ్రాండ్ ఉత్పత్తులను ప్రమోట్‌ చేస్తే ఏకంగా రూ.10 కోట్ల పారితోషకం ఇస్తామని ఆఫర్‌ కూడా చేశారట. అయితే ఐకాన్‌ స్టార్‌ మాత్రం ఆ యాడ్‌ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడని సమాచారం.. జనాల ఆరోగ్యానికి హానికరం కలిగించే అలవాట్లను ప్రోత్సహించే ఉద్దేశం లేని బన్నీ ఆ భారీ ఆఫర్‌ను ఏ మాత్రం ఆలోచించకుండా తిరస్కరించినట్లు సమాచారం.



కాగా ఈ విషయం తెలియడంతో బన్నీ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారట.. తమ హీరోది మంచి మనసంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు షేర్‌ చేస్తున్నారట.. ఇక సినిమాల విషయానికొస్తే.. అల్లు అర్జున్‌ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవలే దేవిశ్రీప్రసాద్‌ సారథ్యంలో మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ కూడా జరిగాయని తెలుస్తుంది.. పుష్ప- ది రూల్‌ పేరుతో మొదటి భాగం కంటే మరింత గ్రాండియర్‌గా సుకుమార్‌ ఈ సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి భాగంలో నటించిన వారితో పాటు మరికొందరు ఫేమస్ యాక్టర్లను కూడా ఎంపిక చేస్తున్నారట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు అయితే తెలియనున్నాయి. ఈ సినిమా మొదటి పార్ట్ కంటే ఎంతో గ్రాండ్ గా ఉండబోతుందని సమాచారం. మరి చూడాలి పుష్ప సినిమా ఏ విధంగా ఉండబోతుం దో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: