కొద్దిరోజులుగా సీనియర్ నటుడు నరేష్ గురించి అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ గురించి వస్తున్న ఎఫైర్ వార్తలు అందరికీ బాగా తెలిసినవే.


వాళ్ళు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు కథనాలు వినిపిస్తున్న వేళ.. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి అవి నిజం అన్నట్టు, అలాగే ఆమె వల్ల తన కాపురం పాడైనట్టు కన్నడ మీడియా ముందుకు వచ్చి నానా రచ్చ చేయడంతో దేశవ్యాప్తంగా ఈ ఇష్యు పాపులర్ అయ్యిందని తెలుస్తుంది.నరేష్.. పవిత్ర లోకేష్ తో రిలేషన్ షిప్ లో ఉంటున్నాడు అనేది బయటపడని రహస్యం.


రమ్యకు విడాకులు ఇవ్వకుండా పవిత్రతో నరేష్ ఎఫైర్ పెట్టుకున్నాడు అనేది రమ్య చేసిన ఆరోపణలు. ఇక్కడ ఆమె మాటలు కూడా పూర్తిగా చెల్లలేదట.. ఎందుకంటే.. రమ్య రఘుపతి కూడా టాలీవుడ్లో కొంతమంది ప్రముఖుల వద్ద డబ్బులు తీసుకుని.. వారిని మోసం చేసినట్లు చాలా వార్తలు కూడా వచ్చాయి. ఇదిలా ఉండగా.. తాజాగా నరేష్, పవిత్రల గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.అదేంటంటే.. తమ రిలేషన్ షిప్ విషయంలో నరేష్, పవిత్ర ఓ అగ్రిమెంట్ కూడా చేసుకున్నారట.


 


దాని ప్రకారం… 'నరేష్ తో రిలేషన్ షిప్ లో ఉన్నంత కాలం నెలకి రూ.25 లక్షలు పవిత్రకి ఇవ్వాలనేది ఆ అగ్రిమెంట్ అని తెలుస్తుంది. ఒక వేల నరేష్ కు పవిత్ర ను దూరం చేసుకోవా లి అనే ఆలోచన భవిష్యత్తులో వస్తే కనుక ఆమెకు భరణంగా రూ.50 కోట్లు పారితోషికం చెల్లించాలి అనేది ఆ అగ్రిమెంట్ అని తెలుస్తుంది.


 


ఇందులో ఎంతవరకు నిజముందో మాత్రం తెలీదు కానీ ఈ న్యూస్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతుంది.'అందుకే నరేష్ భవిష్యత్తులో పెళ్లిళ్లు ఉండవు అంటున్నాడా?' అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారట.. వీళ్ళిద్దరూ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బాగా బిజీ గా గడుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: