బాలీవుడ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో గత ఏడాది సైలెంట్ గా విడుదలై సంచలనం సృష్టించిన చిత్రం దురందర్. ఈ సినిమా నుంచి సీక్వెల్ గా దురంధర్: ది రివేంజ్  19మార్చి 2026న విడుదల కాగా భారీ రెస్పాన్స్ లభించింది. ప్రీమియర్ షోలతోనే హిట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే హిందీలో తప్ప మిగిలిన భాషలలో ప్రీమియర్ షోలు రద్దు అయ్యాయి. శనివారం రోజు నుంచి అన్ని భాషలలో యధావిధిగా స్క్రీనింగ్ మొదలైంది. ఇప్పటికైతే ఈ సినిమా ఓ రేంజ్ లో బజ్ కొనసాగుతోంది. కేవలం రెండు రోజుల్లోనే రూ .500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబడినట్లు వినిపిస్తున్నాయి.


అలాగే దురంధర్ సినిమా కోసం నటీనటులు తీసుకున్న రెమ్యూనరేషన్ కూడా ఇప్పుడు వైరల్ గా మారింది. దురందర్ చిత్రాన్ని రెండు భాగాల షూటింగ్ వేరువేరుగా చేయలేదట. కేవలం ఒకేసారి కలిపి తీసేసారు గత నెలలో మాత్రమే కొంతమేరకు ప్యాచ్ వర్క్ వంటివి చేసినట్లు తెలుస్తోంది. హమ్జా అలీ, జస్కిరాత్ సింగ్  పాత్రలలో నటించిన రణవీర్ సింగ్సినిమా కోసం రూ . 50 కోట్లు తీసుకున్నారు. ఇక రహమాన్ డకాయిట్ (అక్షయ్ ఖన్నా) పాత్ర కోసం ఐదు కోట్ల రూపాయల వరకు పారితోషకం తీసుకున్నట్లు సమాచారం.


ఎస్పీ అస్లాం చౌదరిగా నటించిన సంజయ్ దత్ రూ.10కోట్ల రూపాయలు, ఇంటిలిజెన్స్ బ్యూరో చీఫ్ ఆఫ్ అజయ్ సన్వాల్ పాత్ర చేసినందుకు మాధవన్ కి తొమ్మిది కోట్ల రూపాయలు, మేజర్ ఇక్బాల్ పాత్రలో నటించిన అర్జున్ రాంపాల్, హీరోయిన్ సారా అర్జున్ కి కోటి రూపాయల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు సమాచారం. ఇక డైరెక్టర్, నిర్మాత అయిన ఆదిత్యధర్ రెమ్యూనరేషన్ గురించి మాత్రం ఇప్పటివరకు ఏ విషయం బయటికి రాలేదు. దురంధర్ మూవీ స్టోరీ విషయానికి వస్తే..మన దేశం పైన పాకిస్థాన్ చేస్తున్న వరుస దాడులను ఆపాలి అంటే అక్కడ ఉండే ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించే విధంగా ఇంటిలిజెన్స్ బ్యూరో భావించి" ఆపరేషన్ దురంధర్"  చేపడతారు. ఇందులో భాగంగానే జైలు జీవితాన్ని గడుపుతున్న యువకుడు ఏజెంట్ హమ్జా (రణవీర్ సింగ్) ను మారుపేరుతో పాకిస్తాన్ కి పంపిస్తారు. అక్కడ రహమాన్ డకాయిట్ అనే కరుడుగట్టిన గ్యాంగ్ లో చేరి ఆత్మీయుడుగా ఎలా ఎదుగుతాడు? ఆ ప్రయాణంలో తనకు ఎదురైన సవాల్లేంటి చివరకు హమ్జా రహమాన్ డికాయిట్ ని చంపడంతో మొదటి భాగం ముగుస్తుంది. ఇక రెండో భాగంలో హమ్జా లయారికి ఎలా డాన్ అయ్యారు? భారత్ పైన దాడులు చేసిన మిగిలిన ఉగ్రవాదులను ఎలా చంపేశారు అనేది సినిమా స్టోరీ.

మరింత సమాచారం తెలుసుకోండి: