పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి నటి పూనమ్ కౌర్ కి మధ్య ఎలాంటి వివాదం జరిగిందో వారి మధ్య ఏముందో తెలియదు కానీ ప్రతిసారి పూనమ్ కౌర్ త్రివిక్రమ్,పవన్ కళ్యాణ్ లపై ఎప్పుడు ఏదో ఒక విధంగా విమర్శలు, ఆరోపణలు చేస్తూనే ఉంటుంది. త్రివిక్రమ్ ని ఒకప్పుడు పరోక్షంగా టార్గెట్ చేసిన పూనమ్ కౌర్ ప్రస్తుతం ప్రత్యక్షంగానే టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతుంది. అయితే పవన్ కళ్యాణ్ పై మాత్రం ఇండైరెక్టుగా పోస్టులు పెడుతూ పవన్ కళ్యాణ్ అభిమానులకి కోపం తెప్పిస్తూ ఉంటుంది.అయితే తాజాగా ఫేక్ సింగ్ అంటూ పూనమ్ కౌర్ పెట్టిన పోస్టు మరోసారి సోషల్ మీడియాలో వివాదంగా మారింది.మరి ఇంతకీ పూనమ్ కౌర్ తన పోస్టులో ఏం పెట్టింది..ఎందుకు పవన్ కళ్యాణ్ అభిమానులు పూనమ్ కౌర్ పై మండి పడుతున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 

పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదలై హిట్ టాక్ వచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఇదే సమయంలో బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ నటించిన దురంధర్ 2 మూవీ కూడా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ చరిత్ర సృష్టించింది.అంతేకాదు భారీ కలెక్షన్లు సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. అయితే అలాంటి ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ఎంతోమంది సినీ స్టార్స్ స్పందించారు.ముఖ్యంగా సౌత్ స్టార్స్ ఈ సినిమాని,డైరెక్టర్ని, హీరోని పొగుడుతూ పోస్టులు కూడా పెట్టారు. ఈ నేపథ్యంలోనే నటి పూనమ్ కౌర్ కూడా ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. ఆ పోస్టులో ఏముందంటే.. జస్క్రిత్ సింగ్ రంగీ .. ద రియల్ సింగ్.. స్టోరీ ఆఫ్ రియల్ హీరో.. దురంధర్ 2 సినిమా చూడడానికి నేను కూడా పరిగెత్తుకుంటూ వెళ్లాను.. నో ఫేక్ సింగ్ వుడ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ బాక్సాఫీస్ అంటూ పూనమ్ కౌర్ తన సోషల్ మీడియా ఖాతాలో ట్వీట్ పెట్టింది.. 

అయితే ఇందులో పవన్ కళ్యాణ్ పేరు తీసినట్టు ఎక్కడా కూడా లేదు. కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం పూనమ్ కౌర్ ట్వీట్ ని టార్గెట్ చేస్తూ పూనమ్ చేసిన ట్వీట్ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించే అంటూ కామెంట్లలో పూనమ్ కౌర్ ని ఏకీపారేస్తున్నారు. అయితే గత కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ తన అధికారిక పర్యటనలో భాగంగా మహారాష్ట్ర వెళ్ళినప్పుడు సిక్కు గెటప్ లో కనిపించారు. అందుకే ఆయనని ఫేక్ సిక్కు అని పూనమ్ ఇండైరెక్టుగా విమర్శించిందని కొంతమంది అంటుంటే.. మరికొంత మందేమో దురంధర్ 2 సినిమా ముందు ఉస్తాద్ భగత్ సింగ్ నిలువలేదు అని పూనమ్ పెట్టిన ట్వీట్ అర్థం అని అంటున్నారు. ఇలా పవన్ కళ్యాణ్ అభిమానులు పూనమ్ కౌర్ పెట్టిన ట్వీట్ ని వివాదాస్పదం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: