టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు మెగా కుటుంబం నుంచి వచ్చి మంచి గుర్తింపు పొందారు. మెగా కుటుంబం నుంచి వచ్చి గుర్తింపు పొందిన హీరోలలో వైష్ణవ్ తేజ్ కూడా ఒకరు.


సాయి ధరమ్ తేజ్ కి తమ్ముడిగా మెగాస్టార్ కి మేనల్లుడికి అందరికీ తెలిసిన వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమా ద్వార హీరోగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. వైష్ణవ్ తేజ్ నటించిన మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో హీరోగా వైష్ణవ్ కూడా మంచి గుర్తింపు పొందాడు. ఆ సినిమా తర్వత క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన కొండపాలెం సినిమా కుడా మంచి హిట్ అయ్యింది.


ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ డైరెక్టర్‌ గిరీశయ్యా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగ రంగ వైభవంగా అనే మరో ప్రేమకథ చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం సినిమా ప్రమోషన్ పనులను ప్రారంభించారు. ప్రమోషన్స్ లో భాగంగా వైష్ణవ్ తేజ్ తోపాటు డైరెక్టర్ గిరీషయ్యా కూడా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.


 


ఈ క్రమంలో వైష్ణవ తేజ్ ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో వైష్ణవ్ తేజ్ నటించిన విషయం చాలా మందికి తెలియదు. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో ఒక కదలలేని పేషంట్ గా వైష్ణవ్ తేజ్ నటించాడు. ఈ ఇంటర్వ్యూలో వైష్ణవ తేజ్ మాట్లాడుతూ.. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో నేను కదలకుండా, కన్నార్పకుండా కూర్చోవాలి. కానీ ఒక సన్నివేశంలో బాగా నవ్వాను. దీంతో మామయ్య నాపై పై బాగా సీరియస్ అయ్యాడని వైష్ణవ్ తేజ్ వెల్లడించాడట.


 


మరొక సందర్భంలో మెగా ఫ్యామిలీ గ్యాథరింగ్ ఏవైనా ఫంక్షన్స్ లో తేజ్ అని పిలిస్తే అందరూ ఒకేసారి తిరిగి చూస్తారా?అని యాంకర్ ప్రశ్నించగా.. చిరు మామయ్య ఒరేయ్ అని పిలిస్తే అందరూ ఒక్కసారిగా తిరిగి చూస్తారని వైష్ణవ్ సమాధానం చెప్పాడు. ఇక ఉప్పెన సినిమా స్టొరీ కూడా మామయ్య విని ఓకే చెప్పిన తర్వాతే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించామని వైష్ణవ్ వెల్లడించాడు.ఇక ఈ సినిమాలో జలజల జలపాతం నువ్వు అనే పాటలో చేయడానికి చాలా ఇబ్బంది పడ్డానని తెలిపారు. చుట్టూ అందరూ ఉండటంతో ఈ పాటలో నటించడానికి బాగా ఇబ్బంది పడ్డానని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: