పూరీ జగన్నాథ్ దర్శకనిర్మాతగా విజయ్ దేవరకొండ హీరోగా భారీ అంచనాలతో రిలీజ్ అయిన లైగర్ డిజాస్టర్ అయ్యింది. ఇక రిలీజ్ కి ముందు లైగర్ మూవీ విదేశీ హక్కులు కూడా మంచి ధర పలికాయి. సరిగమ సినిమాస్ వారు ఈ చిత్రం  ఓవర్ సీస్ రైట్స్ ను ఎన్ఆర్ఎ ద్వారా 6 కోట్లకు తీసుకున్నట్లు సమాచారం.విజయ్ దేవరకొండ అండ్ టీం 'లైగర్' పై ఓవర్ కాన్ఫిడెంట్ తో భారీ అంచనాలు ఏర్పడేలా ప్రమోషన్స్ చేశారు. సినిమాపై మంచి బజ్ ఉండటంతో ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూటర్స్ టాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాలకు ఏమాత్రం తగ్గకుండా భారీ ఎత్తున రిలీజ్ చేశారు. అంతేకాదు హాలీవుడ్ సినిమాల స్థాయిలో అనేక పెద్ద స్క్రీన్లలో విడుదల చేసారు.అయితే యూఎస్ ప్రీమియర్స్ తోనే 'లైగర్' కు నెగెటివ్ టాక్ వచ్చేసింది. ప్రీమియర్ షోల ప్రీ సేల్స్ తో పర్వాలేదనిపించినా.. తర్వాత ఏ దశలోనూ ఈ సినిమా లేవలేకపోయింది. లాంగ్ రన్ మీద ఆశతో భారీగా థియేటర్లు బ్లాక్ చేసి పెట్టుకున్న డిస్ట్రిబ్యూటర్.. తీవ్ర నష్టాలు చూడాల్సి వచ్చింది. ఈ సినిమా యుఎస్ లో 3 కోట్లు రాబట్టగలిగిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.


ఈ సంవత్సరం rrr - kgf 2 వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలతో సరిగమ సినిమాస్ ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూటర్స్ మంచి లాభాలతో పాటుగా ఖ్యాతిని గడించారు. కానీ ఇప్పుడు 'లైగర్' తో దెబ్బతిన్నారు. 50 శాతం మేర నష్టపోయారు. మరి ఇప్పుడు పూరీ వారికి నష్టపరిహారం చెల్లిస్తారా అనే చర్చ మొదలైంది.'లైగర్' సినిమా కారణంగా నష్టపోయిన బయ్యర్లను ఆదుకోవాలని డైరెక్టర్ పూరీ జగన్నాధ్ నిర్ణయించుకున్నాడు.అందుకు ఈ వారంలోనే అందరికీ 30 శాతం మేర వెనక్కి తిరిగి ఇవ్వాలని భావిస్తున్నారట. ఇందులో భాగంగా ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూటర్స్ కు కూడా సెటిల్ చేస్తారేమో చూడాలి.ఒక సెటిల్ చేయకుంటే పూరీకే చాలా నష్టం. ఎందుకంటే తన రాబోయే  సినిమాలు మళ్ళీ అక్కడ రిలీజ్ చెయ్యాలి కదా. ఏది ఏమైనా లైగర్ సినిమా మాత్రం అటు పూరీకి ఇంకా ఇటు విజయ్ దేవరకొండకి చాలా నష్టాలు మిగిల్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: