ఈ చిత్ర నిర్మాత అశోక్ సిండే మాట్లాడుతూ సాయి ధన్సిక, డైరెక్టర్ ఓషో తులసీరామ్ కలయికలో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. తెలుగులో మంత్ర మంగళ చిత్రాలను తెరకెక్కించిన ఈయన అదేతరహాలో ఈ సినిమా కూడా ఉంటుందని తెలియజేశారు. మూడు షెడ్యూల్లో ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని.. మొదటి షెడ్యూల్ ఈరోజు హైదరాబాదులో ప్రారంభమైందని తెలిపారు. ఇక మరొక షెడ్యూల్ గోవాలో ప్లాన్ చేశామని మూడవ షెడ్యూల్ హైదరాబాదులోని ప్లాన్ చేశామని తెలియజేశారు దాంతో మొత్తం మీద ఈ సినిమా షూటింగ్ పూర్తి అవుతుందని తెలిపారు.ఇక ఈ చిత్రానికి సంబంధించి నటీనటుల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఆయన తెలియజేశారు. ఇక డైరెక్టర్ ఓషో తులసీరామ్ తెరకెక్కించిన మంత్ర మంగళ సినిమాలు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నాయో అందరికీ తెలిసిన విషయమే. ఇక ఈ చిత్రంలో ఛార్మి నటన కూడా అద్భుతంగా నటించింది. ఇక కలెక్షన్ల పరంగా కూడా మంచి లాభాలను అందుకోవడం కాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాలలో ఈ చిత్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరిచిందని చెప్పవచ్చు. మళ్లీ ఇన్ని రోజుల తర్వాత కబాలి హీరోయిన్ సాయి ధన్సికాతో అలాంటి సినిమాని తెరకెక్కిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి