టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా ప్రొడ్యూసర్లుగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నటువంటి వారిలో అల్లు అరవింద్ మరియు దిల్ రాజు ఒకరు.ఈ ఇద్దరు నిర్మాతలు భారీ బడ్జెట్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే కాకుండా సినిమాలను విజయవంతం చేయడంలో పెద్ద ఎత్తున పోటీ పడుతుంటారు.అయితే తాజాగా ఈ ఇద్దరు నిర్మాతల మధ్య మరోసారి పెద్ద ఎత్తున పోటీ ఏర్పడినట్లు తెలుస్తోంది.


అయితే ఈ ఇద్దరు ఈసారి తెలుగు సినిమాల కోసం కాకుండా తమిళ రీమేక్ సినిమాల కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇతర భాషలలో తెరికెక్కిన సినిమాలు తెలుగులో డబ్ అవుతు తెలుగులో కూడా విడుదలవుతున్న విషయం మనకు తెలిసిందే.


ఈ క్రమంలోనే అల్లు అరవింద్ ధనుష్ నటించిన నేనే వస్తున్నా అనే సినిమాని తెలుగులో విడుదల చేయడానికి సిద్ధమయ్యారట. అదేవిధంగా దిల్ రాజు మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటించిన పొన్నియన్ సెల్వన్ 1 సినిమాని తెలుగులో విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 30వ తేదీ పెద్ద ఎత్తున విడుదలకు సిద్ధమవుతుంది అలాగే ధనుష్ నేనే వస్తున్న సినిమా కూడా సెప్టెంబర్ 29వ తేదీ విడుదల కానుందట..


  ఈ విధంగా ఒక్కరోజు తేడాతో ఈ రెండు సినిమాలు విడుదల కావడమే కాకుండా తెలుగులో బడా ప్రొడ్యూసర్లు ఇద్దరు ఈ సినిమాలను విడుదల చేయడంతో వీరి మధ్య గట్టి పోటీ ఏర్పడింది. ఈ విధంగా ఒక రోజు వ్యవధిలోనే రెండు భారీ సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో ఈ ఇద్దరు ప్రొడ్యూసర్లు ఈ సినిమాల విజయాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించారట..దీంతో ఈ సినిమాలను విడుదల చేయడం కోసం థియేటర్ల విషయంలో పెద్ద ఎత్తున వీరి మధ్య మరోసారి పోటీ ఏర్పడిందని తెలుస్తుంది. మరి ఈ పోటీలో ఎవరు విజయం అందుకుంటారు ఎవరు చేదు అనుభవాన్ని ఎదుర్కొంటారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: