బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ని 'లాల్ సింగ్ చడ్డా' సినిమా ఎంతగా నిరాశ పరిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా వాటిని అందుకోవడంలో అసలు పూర్తిగా విఫలమైంది.అయితే దీనికి కారణాలు చాలా వున్నాయి. కానీ అమీర్ ఖాన్ మాత్రం ఎంతో ఇష్టపడి చేసిన ఈ సినిమా ఫ్లాప్ కావడంతో బాగా మనస్తాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల పాటు ముంబై విడిచిపెట్టాలని నిర్ణయించుకుని అమెరికాకు వెళ్లిపోయారు.ఇక 'లాల్ సింగ్ చడ్డా' సినిమా చేదు జ్ఞాపకాల నుంచి వీలైనంత త్వరగా బయటపడాలని అమీర్ అమెరికా ట్రిప్ వేసారు. ప్రస్తుతం అయన అక్కడే రెస్ట్ తీసుకుంటూ సేద తీరుతున్నారు. మరోవైపు అమీర్ తదుపరి ఏ సినిమా చేస్తారు? అన్న వార్తలు నెట్టింట జోరుగా వైరల్ అవుతున్నాయి. అమీర్ ఖాన్ హిట్ తో ముందుకు రావాలంటూ ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.ఈ నేపథ్యంలో తాజా ప్రాజెక్ట్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది.


స్పానిష్ చిత్రం 'క్యాంపియోన్స్' ఆధారంగా అమీర్ ఖాన్ తదుపరి సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఆ సినిమా స్ఫూర్తితో అమీర్ కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. వాస్తవానికి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభమైనట్లు సమాచారం. ఇప్పుడవి దాదాపు ఓ కొలిక్కి వచ్చాయి.ఇక ఈ సినిమాకి 'శుభ్ మంగళ్ సావధాన్' దర్శకుడు ఆర్.ఎస్ ప్రసన్న తెరకెక్కించనున్నారు. వచ్చే ఏడాది జనవరిలో సినిమా ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. ఆరు నెలల్లోనే షూటింగ్ పూర్తిచేయాలన్నది ప్లాన్ గా చెబుతున్నారు.ఇందులో అమీర్ ఖాన్ పొగరబోతు బాస్కెట్ బాల్ కోచ్ గా పాత్రలో కనిపించనున్నారట.ఆ పాత్ర ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందని సమాచారం. మాతృకకు మించి మరింత శక్తివంతం గా పాత్రని డిజైన్ చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో అమీర్ ఖాన్ కి జోడీగా అనుష్క శర్మ నటిస్తుందని సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: