నిర్మాత బెల్లంకొండ సురేష్ తన పెద్దకొడుకు బెల్లంకొండ శ్రీనివాసు ను హీరోగా సెటిల్ చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసాడు. తన కొడుకు నటించే సినిమా కథ వినడం దగ్గర నుంచి ఆ సినిమాకు సంబంధించిన టెక్నిషియన్స్ ఎంపిక ఆ సినిమా పబ్లిసిటీ ఇలా అన్ని విషయాలు బెల్లంకొండ సురేష్ చూసుకునే వాడు అని అంటారు. ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ శ్రీనివాస్ హీరోగా సెటిల్ కాలేకపోయాడు.


దీనితో నిర్మాత సురేష్ తన ఆశలు అన్నీ తన చిన్నకొడుకు గణేష్ పై పెట్టుకున్నాడు. వాస్తవానికి ఈ యంగ్ హీరో మొదటి సినిమా ఎప్పుడో విడుదల కావలసి ఉంది. అయితే కొన్ని కారణాలు వల్ల ఆ సినిమా మధ్యలో ఆగిపోయింది అని అంటారు. అయినప్పటికీ గణేష్ కు రెండవ అవకాశం రావడమే కాకుండా ఆ సినిమాను ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మిస్తూ ఉండటంతో తన రెండవ కొడుకు సినిమా హిట్ అవుతుంది అన్న నమ్మకం బెల్లంకొండ సురేష్ కు ఏర్పడింది అంటారు.


అయితే ఇప్పుడు ఆ మూవీని దసరా రేస్ కు విడుదల చేయడమే కాకుండా ఆ మూవీని చిరంజీవి నాగార్జున ల సినిమాల మధ్య విడుదల చేయడం ఏమాత్రం బెల్లంకొండ సురేష్ కు ఇష్టం లేదు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సాధారణంగా చిన్నసినిమాలు తమ సినిమాలకు మొదటిరోజు వచ్చే పాజిటివ్ టాక్ బట్టి ఆ సినిమాల రిజల్ట్ ఉంటుంది.


ఇప్పుడు గణేష్ ‘స్వాతిముత్యం’ ఏకంగా ‘గాడ్ ఫాదర్’ ‘ది ఘోస్ట్’ ల మధ్య విడుదల అవుతూ ఉండటంతో ఆ రెండు భారీ సినిమాల హోరులో ‘స్వాతిముత్యం’ సినిమా బాగున్నప్పటికీ ఆసినిమాను ఎవరు పట్టించుకుంటారు అన్న భయం బెల్లంకొండ సురేష్ కు ఉంది అని అంటున్నారు. దీనికితోడు ఈ సినిమాను కేవలం 10 కోట్ల పెట్టుబడితో తీయడంతో దసరా సీజన్ వచ్చే మొదటివారం కలక్షన్స్ తో తమ సినిమా గట్టెక్కిపోతుంది అని ఈసినిమా నిర్మాతల నమ్మకం అని అంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: