దాదాపు 12 సంవత్సరాల విరామం తరువాత సూపర్  స్టార్  మహేష్ బాబు త్రివిక్రమ్ ల కలయికలో రూపొందుతున్న సినిమా SSMB28. ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూసిన ఈ భారీప్రాజెక్ట్ రీసెంట్ గా రెగ్యులర్ షూటింగ్ మొదలైన విషయం తెలిసిందే. పలు యాక్షన్ ఘట్టాలని మహేష్ కొంత మంది ఫైటర్స్ పై భారీ స్థాయిలో చిత్రీకరించారు. దీంతో ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. త్వరలో సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది.అయితే ఈ మూవీ కోసం బడ్జెట్  రూ. 200 కోట్లు ఖర్చు చేస్తున్నారని బిజినెస్ దాదాపుగా రూ. 300 కోట్ల మేర జరుగుతోందని ఆడియో హక్కులకే భారీ స్థాయిలో రూ. 30 కోట్లు డిమాండ్ చేస్తున్నారని ఓటీటీ శాటిలైట్ థియేట్రికల్ రైట్స్ పరంగానూ భారీ పోటీ నెలకొందంటూ ఇటీవల ఈ ప్రాజెక్ట్ పై రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని సూర్యదేవర నాగవంశీ తాజాగా మీడియాతో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు.


SSMB28 పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాదని అలాంటప్పుడు వందల కోట్ల బిజినెస్ ఎలా జరుగుతుందని ఇంకా మేము బిజినెసే మొదలు పెట్టలేదని అంతే కాకుండా ఈ మూవీకి బడ్జెట్ ఎంత అన్నది ఇంకా మాకే క్లారిటీ రాలేదని అలాంటప్పుడు షూటింగ్ దశలోనే బిజినెస్ ఎలా మొదలు పెడతామన్నాడు సూర్యదేవర నాగవంశీ.ఈ రోజుల్లో ప్రతీ స్టార్ సినిమా ఆడియో రైట్స్ కి రూ. 5 నుంచి 6 కోట్లు వస్తున్నాయన్నారు. అలాంటప్పుడు SSMB28 ఆడియోకు 25 నుంచి 30 కోట్లు అన్నది ట్రాష్ అని వంశీ కొట్టి పారేశారు. దీంతో ఈ సినిమా పై జరుగుతున్న ప్రచారం అంతా కూడా ఫేక్ న్యూస్ అని క్లారిటీ వచ్చేసింది.ఇక ఈ సినిమా తరువాత సూపర్  స్టార్  మహేష్ బాబు పాన్  ఇండియా టాప్  డైరెక్టర్  ఎస్ ఎస్ రాజమౌళితో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కుతుంది. అంతేగాక ఇది రాజమౌళి కెరీర్ లోనే బిగ్గెస్ట్ సినిమా అని రాజమౌళి ఇటీవల అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: