ప్రస్తుతం భారత పర్యటనకు వచ్చిన సౌతాఫ్రికాతో టి20 సిరీస్ ఆడుతోంది టీమిండియా జట్టు  ఈ క్రమంలోనే ఇప్పటికే మూడు మ్యాచ్ల టి20 సిరీస్లో భాగంగా రెండు మ్యాచులు పూర్తి చేసుకుంది అనే విషయం తెలిసిందే  ఇక ఈ మూడు టి20ల సిరీస్ లో భాగంగా రెండు మ్యాచ్ లలో ఘన విజయాన్ని సాధించడంతో 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మూడో మ్యాచ్ కేవలం నామమాత్రమైన మ్యాచ్ గా మారిపోయింది. ఈ మ్యాచ్ లో కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వబోతున్నాము అన్న వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 కాగా ఈ మూడవ టి20 మ్యాచ్ అక్టోబర్ 4వ తేదీన ఇండోర్లోని హోల్కల్ క్రికెట్ స్టేడియంలో జరగబోతుంది అనేది తెలుస్తుంది. అయితే నామమాత్రమైన ఈ మ్యాచ్ కు భారత స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి తీసుకోబోతున్నాడు అన్నది తెలుస్తోంది. కాగా టి20 ప్రపంచ కప్ కోసం భారత్ ఆస్ట్రేలియా కు అక్టోబర్ ఆరవ తేదీన బయలుదేరబోతుంది అన్న విషయం తెలిసిందే. ముంబై నుంచి ప్రత్యేక విమానంలో టీమిండియా ఆటగాళ్లు ఆస్ట్రేలియా గడ్డపై అడుగు పెట్టబోతున్నారు. ఈ క్రమంలోనె మూడో మ్యాచ్ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ రెండు రోజులపాటు విశ్రాంతి తీసుకుని ఇక ఆ తర్వాత అక్టోబర్ ఆరవ తేదీన జట్టుతో కలవబోతున్నాడు అని తెలుస్తుంది.


 కాగా ప్రస్తుతం స్వదేశంలో వరుసగా మ్యాచ్లు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే విరాట్ కోహ్లీ ముంబైలో ఉన్న తన ఇంటికి వెళ్ళాడు అని టాక్ వినిపిస్తుంది. కోహ్లీ స్థానంలో శ్రేయస్ రాబోతున్నాడట. ఇకపోతే నేడు జరగబోయే టి20 మ్యాచ్ తో అటు టి20 సిరీస్ ముగిసిపోతుంది. అయితే ఈ సిరీస్ ముగిసిన కేవలం రెండు రోజుల వ్యవధిలోనే భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కాబోతుంది అనేది తెలుస్తుంది. ఇకపోతే టి20 ప్రపంచ కప్ లో పాల్గొనబోయే 15 మందిలో ఎవరు కూడా వన్డే సిరీస్ ఆడటం లేదు   అంతేకాదు వన్డే సిరీస్ జట్టుకు శిఖర్ ధావన్ కెప్టెన్సీ వహించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: