తెలుగు రాష్ట్రాలలో ఉన్న మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న రోజుకి ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రం రేపే గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానుంది. ఇందులో చిరంజీవి తో పాటుగా, సల్మాన్ ఖాన్, సత్యదేవ్, నయనతార, సునీల్, మురళీశర్మ మరియు సముద్ర ఖని లాంటి నటులు భాగం అయ్యారు. కాగా ఈ సినిమా ఆల్రెడీ మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన లూసిఫర్ కు రీమేక్ గా వస్తోంది. ఇందులో హీరోగా మోహన్ లాల్ నటించి సినిమాను వేరే స్థాయికి తీసుకెళ్లారు.

ఈ సినిమాను "తని ఒరువన్" లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను అందించిన డైరెక్టర్ మోహన్ రాజా తన భుజాలపై ఎత్తుకున్నాడు.  ఇక మరో విశేషం ఏమిటంటే ఈ సినిమాకు ఒక నిర్మాతగా రామ్ చరణ్ తేజ్ ఉన్నారు. లూసిఫర్ మెయిన్ ప్లాట్ ను మార్చకుండా, తెలుగు నేటివిటీకి తగినట్లుగా కొన్ని మార్పులు చేసి సినిమాను పూర్తి చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లలోనూ ఈ సినిమాపై అందరూ ఎంతో నమ్మకంతో ఉన్నారు. అయితే సినిమా ఎంత బాగా వచ్చినా, రిలీజ్ కు ముందు చిత్ర బృందం లో ఉండే భయం వేరు. రేపు మొదటి షో పూర్తయ్యే వరకు అందరూ చాలా టెన్షన్ లో ఉంటారు అన్నది అక్షర సత్యం.

ఇక మెగాస్టార్ చిరంజీవి అయితే ఎక్కువగా ఒత్తిడిలో ఉంటారు. కారణం తన లాస్ట్ సినిమా ఆచార్య అంచనాలకు మించి ప్లాప్ అయింది. అందుకే ఈ సినిమా సక్సెస్ కావడం చిరుకు చాలా అవసరం. కాగా ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉండడంతో మరింత కంగారుగా ఉన్నారు. ఇక మరోవైపు చిరంజీవి ఫ్యాన్స్ ఈ సినిమా కోసం పడిగాపులు కాస్తున్నారు. ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అద్భుతంగా జరిగినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా చిరుకు సక్సెస్ ను అందించి ఫ్యాన్స్ ను సంతోషపెడుతుందా లేదా అన్నది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: