ఇటీవల కాలం లో బుల్లితెర కార్యక్రమాల హవా ఎంతలా పెరిగి పోతు ఉందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే కేవలం సినిమాలు మాత్రమే అనుకునేవారు ప్రేక్షకులు. కానీ ఇప్పుడు మాత్రం సినిమాల్లో కూడా దొరకనీ ఎంటర్టైన్మెంట్ అటు బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులు పొందుతున్నారు అని చెప్పాలి. ఎప్పటికప్పుడు వినూత్నమైన కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న బుల్లితెర కార్యక్రమాలు సరి కొత్తగా ప్రేక్షకులను అలరిస్తూ టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటున్నాయ్.


 ఇక ఇలాంటి బుల్లితెర కార్యక్రమాల లో ఈటీవీ లో ప్రసారమయ్యే డ్యాన్స్ రియాలిటీ షో ఢీ కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే  ఎన్నో ఏళ్ల నుంచి ఎంతో సక్సెస్ఫుల్గా కొనసాగుతూ వస్తుంది ఈ కార్యక్రమం.  ఇక ఒకప్పుడు కేవలం డాన్సులు మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు మాత్రం డాన్స్లతో పాటు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ కూడా ఢీ షోలో ప్రేక్షకులు పొందుతున్నారు అని చెప్పాలి. ప్రతి బుధవారం ప్రసారమయ్యే ఈ షోను ఏమాత్రం మిస్ చేయకుండా చూస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈ షోలో జడ్జిగా శ్రద్ధదాస్ గత కొన్ని ఎపిసోడ్ల నుంచి కనిపిస్తుంది.


 హీరోయిన్స్ శ్రద్ధాదాస్ జడ్జిగా వచ్చిందో లేదో అటు టీం లీడర్ గా ఉన్న హైపర్ ఆది తనదైన పంచులతో శ్రద్ధదాస్ పై కౌంటర్లు వేస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఒక హగ్ ఇవ్వాలి కిస్ ఇవ్వాలి అంటూ ఎప్పుడు అడుగుతూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవలే విడుదలైన ఢీ ప్రోమోలో చూసుకుంటే ఏకంగా శ్రద్ధ దాస్ హైపర్ ఆది చెంప చెల్లుమనిపించింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఒక ఫన్నీ స్కిట్ లో భాగంగా తనకు ముద్దు ఇవ్వాలి అని హిందీలో చెబుతాడు హైపర్ ఆది. ఇలాంటి సమయంలోనే శ్రద్ధాదాస్ ఏకంగా చెంప చెల్లుమనిపించింది. దీంతో ఒక్కసారిగా హైపర్ ఆది షాక్ అవుతాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: