తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ అనేది ఒక సెన్సేషన్ అని చెప్పడంలో అభిషేక్ లేదు . ఎందుకంటే ఒక సాదాసీదా కామెడీ షో గా ప్రారంభమైన జబర్దస్త్ కార్యక్రమం ఏకంగా బుల్లితెరపై సెన్సేషన్ సృష్టించింది అనే విధంగా టాప్ రేటింగ్స్ సొంతం  చేసుకుంది అని చెప్పాలి. ఒకప్పుడు సినిమాల్లో కామెడీ మాత్రమే ఎక్కువగా ఆస్వాదించేవారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం సినిమాల కంటే జబర్దస్త్ లోనే కామెడీకే ఎక్కువగా నవ్వుకుంటున్నారు అని చెప్పాలి. జబర్దస్త్ కార్యక్రమంలో ఇప్పుడు వరకు ఎన్నో మార్పులు జరిగిపోయాయి.


 జబర్దస్త్ మొదలైనప్పుడు ఉన్న కమెడియన్స్ ఇప్పుడు దాదాపుగా ఎవరూ లేరు. జడ్జిలుగా ఉన్న నాగబాబు రోజా కూడా ఇప్పుడు తప్పుకున్నారు అన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు యాంకర్ గా కొనసాగిన అనసూయ సైతం ఇక ఇప్పుడు పక్క ఛానెల్ కు వెళ్ళిపోయింది. ఇలా ఎంతోమంది జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడం మళ్ళీ తిరిగి రావడం లాంటివి జరిగాయి. కానీ జబర్దస్త్ మొదలై పదేళ్లు కావస్తుంది ఇప్పటివరకు అటు రాకెట్ రాఘవ మాత్రం జబర్దస్త్ షోను వీడలేదు. సినిమాల్లో ఎన్ని అవకాశాలు వచ్చినా ఎంత బిజీగా ఉన్నా జబర్దస్త్ షెడ్యూల్ మాత్రం మిస్ కాకుండా వస్తాడు.


 ఎలాంటి కష్టమైన పరిస్థితులు ఎదురైనా కూడా జబర్దస్త్ను వదిలేయకుండా రాకెట్ రాఘవ పాతుకుపోయాడు అని చెప్పాలి. అయితే జబర్దస్త్ లో ఇస్తున్న దాని కంటే రెండు రెట్లు ఎక్కువ ఇస్తామని చెప్పినా కూడా రాకెట్ రాఘవ మాత్రం ఎక్కడికి వెళ్లేందుకు మొగ్గు చూపలేదు. రాకెట్ రాఘవపై జబర్దస్త్ వాళ్లకి ప్రత్యేకమైన అభిమానం ఉందట. ఇక రాఘవకు కూడా జబర్దస్త్ లైఫ్ ఇచ్చింది. కాబట్టి వదిలేందుకు ఇష్టపడట్లేదట. జబర్దస్త్ లో తాను ఒక పొజిషన్లో ఉన్నానని కనుక ఇంకా మంచి పొజిషన్ వస్తుందని జబర్దస్త్ వీడటం లేదు అన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఏది ఏమైనా తనకు లైఫ్ ఇచ్చిన షో కోసం రాఘవ ఎన్నో ఆఫర్లను తిరస్కరిస్తున్నాడు అన్నది మాత్రం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: