టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక కొత్త ప్రాజెక్టును మొదలుపెట్టారు.ఆ ప్రాజెక్టుకు SSMB -28 అనే ప్రాజెక్టు పేరు పెట్టడం జరిగింది. దీంతో అభిమానులకు భారీగా అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఈ ప్రాజెక్టు సంబంధించి మొదటి షెడ్యూల్ ఇటీవలే చాలా స్పీడ్ గా పూర్తి అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మరొక షెడ్యూల్ కూడా వీలైనంత తొందరగా ప్రారంభించాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. అయితే సెకండ్ షెడ్యూలు కొంత ఆలస్యంగా మొదలవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.


ఎందుచేత అంటే ఇటీవలే మహేష్ బాబు తల్లి మరణించడంతో మహేష్ బాబు ఇప్పట్లో షూటింగ్ కి వచ్చే ఆలోచనలో లేరు అన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇటీవలే అన్ని పనులు ముగించుకున్న మహేష్ బాబు కాస్త రెస్ట్ తీసుకొని మళ్ళీ సినిమా షూటింగుల్లో బిజీ కావాలనుకుంటున్నట్లుగా సమాచారం. దీంతో త్రివిక్రమ్ కూడా తన ప్రాజెక్టుకు సంబంధించి మరొక ప్లానింగ్ సిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం అక్టోబర్ 10వ తేదీ నుంచి సెకండ్ షెడ్యూల్ మొదలు పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది అలాగే సీరియస్ వార్నింగ్ ఇచ్చే సన్నివేశాలను కూడా చిత్రీకరించబోతున్నట్లు సమాచారం.


ఈ షెడ్యూల్ ను త్వర త్వరగా పూర్తిచేసి.. సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ , జనవరి లోపల పూర్తి చేసి ఈ సినిమాని వచ్చే యేడాది మార్చిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. ఇక ఈ సినిమా ప్రమోషన్ ను మాత్రం జనవరి నుంచి మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం ప్రముఖ నటుడు పృధ్విరాజ్ ను సంప్రదించినట్లుగా సమాచారం. హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తూ ఉండగా.. సంగీతాన్ని మాత్రం థమన్ అందిస్తున్నారు. మరి ఈ సినిమాతో మహేష్ బాబు త్రివిక్రమ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: