విజయ్ దేవరకొండ తరువాత యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరోలలో విశ్వక్ సేన్ చాలముందు వరసలో ఉంటాడు. ఈమధ్య కాలంలో అతడి సినిమాలు సూపర్ హిట్ అవ్వకపోయినప్పటికీ అతని మ్యానియా ఇంకా కొనసాగుతూనే ఉంది. సీనియర్ హీరో వెంకటేష్ తో కలిసి ఈ క్రేజీ యంగ్ హీరో నటించిన ‘ఓరి దేవుడా’ మూవీ ప్రమోషన్ ను విపరీతంగా చేస్తున్నారు.


ఈమూవీ ప్రమోషన్ లో విశ్వక్ సేన్ తో సిద్దూ జొన్నలగడ్డ కూడ బాగా యాక్టివ్ గా పాల్గొన్నాడు. ఈ సందర్భంలో ఒక మీడియా మీట్ లో సిద్దూ విశ్వక్ సేన్ పై చేసిన కామెంట్స్ చాలామందిని ఆశ్చర్య పరుస్తున్నాయి. తాను ఈసినిమా ప్రమోషన్ కు సంబంధించి విశ్వక్ సేన్ తో కలిసి ఫంక్షన్స్ కు వెళ్ళినప్పుడు యూత్ లో విశ్వక్ సేన్ కు ఉన్న క్రేజ్ ను చూసి తాను ఆశ్చర్యపోయాను అని చెపుతూ రానున్న రోజులలో ‘బ్లడీ సూపర్ స్టార్’ అన్న ట్యాగ్ తో విశ్వక్ సేన్ హవా కొనసాగే అవకాశాలు ఉన్నాయి అంటూ సిద్దూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.


మల్టీ స్టారర్ మూవీగా నిర్మాణం జరుపుకున్న ఈమూవీలో వెంకటేష్ విశ్వక్ సేన్ తో కలిసి నటించడంతో ఈమూవీ పై అంచనాలు పెరిగాయి. అయితే ఈమూవీ దీపావళి సీజన్ కు విడుదల అవుతున్న అనేక సినిమాల మధ్య విడుదల అవుతూ ఉండటంతో ఈమూవీ ఎంతవరకు నిలబడగలుగుతుంది అన్న సందేహాలకు ఈ వీకెండ్ తరువాత సమాధానం దొరికే ఆస్కారం ఉంది.


సాధారణంగా వెంకటేష్ యంగ్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకునే విషయంలో ఎటువంటి ఇగో లకు లోను కాకుండా యంగ్ హీరోలను ఎంకరేజ్ చేస్తూ మంచి సలహాలు ఇస్తూ ఉంటాడు అని అంటూ ఉంటారు. ఇప్పుడు విశ్వక్ సేన్ విషయంలో కూడ అదే జరిగిందని అంటున్నారు. ఈమధ్య కాలంలో మల్టీ స్టారర్స్ ను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్న పరిస్థితులలో ఈసినిమా పై కూడ అంచనాలు ఉన్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: