మాటివిలో ప్రసరమయ్యే బిగ్  బాస్ సీజన్ 6 లో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే దాంట్లో ప్రతి ఒక్కరికి ఆసక్తిని నెలకొంది.  ఈవారం ఫ్యామిలీ వీక్ అవ్వడం వల్ల చాలామంది కంటెస్టెంట్ల ఓటింగ్ మారిపోయింది.ఇక నామినేషన్ తర్వాత మొదటి రెండు రోజుల్లో ఇనయా, రోహిత్ లు టాప్ ప్లేస్ లో ఉన్నారు. ఇక శ్రీ సత్య మాత్రం డేంజర్ జోన్ లో ఉంది.ఈసారి ఆమె వెళ్లిపోవడం కన్ఫామ్ అని అందరూ అనుకున్నారు. కానీ ఫ్యామిలీ వీక్ శ్రీ సత్య కు ప్లస్ అయింది.అయితే వాళ్ల పేరెంట్స్ హౌస్ లోకి రావడంతో ఆమె ఓటింగ్ లో ఒక్కసారి గా మార్పు వచ్చింది.ఈవారం ఎలిమినేషన్ నుండి తప్పించుకున్నట్లే అని వార్తలు వస్తున్నాయ్.మొదటి నుండి కూడా ఫైమా, శ్రీ సత్య ఇద్దరు లీస్టులో ఉన్నారు. 

 ఫైమా దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉండడంతో ఒకవేళ ఆమెకు తక్కువ ఓట్లు పడ్డా కూడా ఎలిమినేట్ అవకుండా బయటపడవచ్చు. అయితే ఒకవేళ ఆమె ఎలిమినేట్ అవ్వకపోయినా కూడా బిగ్బాస్ లీస్ట్ లో ఉన్న ముగ్గురిని నిల్చోబెట్టి ఖచ్చితంగా ఫైమాని ఆ ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడుకునేట్లు చేస్తాడు ఎలిమినేట్ అవుతానేమో ననే భయంతో ఫైమా ఆ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ని ఉపయోగించుకుంటుంది. ఇక ఎగ్జాంపుల్ కి ఫైమా,శ్రీ సత్య ఇద్దరు లీస్టులో ఉంటే ఫైమా తన ఎవిక్షన్ ఫ్రీ పాస్ ను ఉపయోగించి ఎలిమినేషన్ నుండి తప్పించుకుంటుంది. ఆ టైంలో ఎలిమిషన్ లేనట్టే అని అందరూ అనుకుంటారు.ఇక్కడ ఉన్న పెద్ద ట్విస్ట్ ఏంటంటే.. ఫైమా, శ్రీ సత్య కంటే తక్కువ ఓట్లు పోల్ చేసుకుని ఎవిక్షన్ ప్రీ పాస్ ద్వారా సేవ్ అవుతుందనుకోండిఅయితే . ఒకవేళ శ్రీ సత్యకు ఫైమా కంటే ఎక్కువ ఓట్లు వస్తే ఆమె కూడా సేవ్ అవుతుంది.

 శ్రీ సత్య కంటే ఫైమాకి ఎక్కువ ఓట్లు పోల్ అయినప్పటికీ ఆ విషయం తెలియక ఫైమా ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉపయోగించుకుంటే ఇక దాని ఉపయోగం ఏమీ లేనట్టే.ఈ వారం ఫైమా ఎవిక్షన్ ఫ్రీ పాస్ ద్వారా సేవ్ అయినప్పటికీ రాజ్,రోహిత్, శ్రీ సత్య,ఆదిరెడ్డి నలుగురిలో ఎవరో ఒకరు ఎలిమినేషన్ ఉండొచ్చు.ఇక వీరందరిలో శ్రీ సత్య ఎలిమినేట్ అయితే మనం పెద్దగా ఆలోచించాల్సిన విషయం కాదు.ఆమె ఎప్పుడో వెళ్ళిపోతుంది అనుకున్నారు ఇప్పటిదాకా రావడమే ఎక్కువ.అయితే  ఒకవేళ శ్రీ సత్యకు ఓట్లు తక్కువ పడ్డా కూడా రోహిత్ లేదా ఆదిరెడ్డిలలో ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేస్తే కచ్చితంగా బిగ్ బాస్ యాజమాన్యం కంటెస్టెంట్ ని మేనేజ్మెంట్ కోటా కోసమే ఎంచుకున్నట్టు కన్ఫామ్ చేసుకోవచ్చు. ఇప్పటికే బిగ్ బాస్ యాజమాన్యం టాప్ 5 కంటెస్టెంట్స్ ని మేనేజ్మెంట్ ప్రాతిపదికన ఎంపిక చేస్తారనే టాక్ ఎప్పటినుండే ఉంది.అయితే  ఒకవేళ ఇదే జరిగితే శ్రీ సత్య విన్నరైన అవాక్కవ్వాల్సిన పని లేదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: